కరోనా దెబ్బ మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడాలంటే భయపడిపోతున్నారు.ఇక కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన వాళ్ళ దగ్గరికెళ్ళే ధైర్యం చేయట్లేదు.ఇలాంటి టైంలో తమ ప్రాణాలకు తెగించి వాళ్ళకు నిరంతరం మెడికేషన్ చేస్తున్న డాక్టర్లను,హాస్పిటల్ సిబ్బందిని దేశములోని ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారు.
తాజాగా కర్ణాటకలోని విజయనగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో హాస్పిటల్ సిబ్బంది కరోనా వచ్చిన పేషంట్స్ తో కాలు కదిపారు.ఈ వీడియోను ప్రభుత్వ Ani సంస్థ తమ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం కోసం ఒకపక్క ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.మరోపక్క తమ బాధ్యతను నిర్వహించేందుకు డాక్టర్లు మరియు హాస్పిటల్ సిబ్బంది కరోనా పేషంట్స్ మోరల్ ను పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరి ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
#WATCH Karnataka: Asymptomatic #COVID19 positive patients organise a flash mob at a COVID care centre in Bellary where they are admitted. (19.07.2020) pic.twitter.com/30D6E4ESOV
— ANI (@ANI) July 20, 2020