బుల్లితెరపై బాగా సక్సెస్ ఐన కామెడీ షో జబర్దస్త్.ఈ షో తో కెరీర్ ను ఆరంభించి సినిమాలలోకి వెళ్లిన కమెడియన్లు చాలామందే ఉన్నారు.జనాలు ఎప్పుడూ నవ్వుకోవడానికి సిద్ధంగా ఉంటారు అలా నవ్వించడంలో విజయం సాధించింది కాబట్టే ఈ షో ఇంత సక్సెస్ అయ్యింది.లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే.

కరోనా కారణంగా సినిమాల షూటింగ్ లతో పాటు సీరియళ్లు, గేమ్, రియాల్టీషోలు,జబర్దస్త్ కూడా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకు, టీవీ షో లకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే గురువారం (25th June 2020) కి రాబోయే జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసారు.
ప్రస్తుతం జబర్దస్త్ షో మళ్ళీ ముందుకు దూసుకువెళ్తుంది.అయితే మంచి పెర్ఫార్మన్స్ లేని కమెడియన్ లను షో నుండి తొలగించాలని మల్లెమాల బృందం చూస్తుంది అనే వార్త వైరల్ కొన్ని రోజుల నుండి వైరల్ అవుతుంది. ఇప్పుడు కొత్త ప్రోమో చూస్తే అదే నిజం అనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు ఆరు టీం లు ఉన్నాయని అనసూయ ప్రోమో లో అన్నారు. అలాగే చివర్లో వెంకీస్ మంకీస్ టీం లో కూడా “అలంటి పంచ్ లు వేసినందుకు ఆ రెండు టీం లు పోయాయి” అన్నారు. తాగుబోతు రమేష్ టీం లో కూడా ఆ రెండు టీంల నుండి తీసేస్తే ఇక్కడికి వచ్చాము అన్నారు జీవన్, శాంతి కుమార్.

ఆ రెండు టీం లు ఏమయ్యి ఉంటాయి అనేది నెట్ ఇంట చర్చనీయాంశం అయ్యింది. సరికొత్త ప్రోమోను బట్టి చూస్తే మిస్ అయిన టీం లు “జిగేల్ జీవన్ & మస్తీ మహీధర్” మరియు “ఫసక్ శశి & శాంతి కుమార్” . ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.







అసలు ఈ యుగాంతం అనేది ఇప్పుడు కొత్త కాదు 2003 మేలో యుగాంతం అన్నారు..సుమేరియన్లు కనిపెట్టిన గ్రహం నిబిరూ.. భూమి వైపు వెళుతుందనే వాదనల దగ్గర స్టార్టయింది యుగాంతం కథ..ఆ కథ ఆధారంగా 2003 మేలో యుగాంతం అని ఒక అంచనాకి వచ్చారు.. కానీ జరిగిందా…జరగలేదు.. మళ్లీ డూమ్స్ డే తేదీని బట్టి డిసెంబర్ 21, 2012 యుగాంతం పోస్ట్ పోన్ అయంది.. అప్పుడు యుగం అంతం అయిందా అంతం కాలేదు..





























