Ads
సాధారణంగా మనం బయటికి ఎక్కడికైనా వెళ్తూ ఉంటే మన మెదడులోకి వచ్చే మొదటి ప్రశ్న, ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని. దీని మీద గంటలు గంటలు గడిపేస్తాం. అయితే చాలా మంది మాత్రం ఇలాంటి సమయాన్ని తగ్గిస్తున్నారు. అంటే, రోజు ఒకటే రకమైన డ్రెస్ వేసుకుంటున్నారు. ఇలా వేసుకుంటే బోర్ కొట్టదా అని మనకి అనిపించవచ్చు. కానీ వాళ్లు అలా చేయడానికి వెనుక కారణాలు కూడా ఉన్నాయి. సాధారణ వ్యక్తులు ఇలా చేస్తే సరే. కానీ సెలబ్రిటీలు కూడా ఇలా ఒకటే రకమైన డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకునే సెలబ్రిటీలు ఎవరో, వాళ్లు అలా చేయడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 చంద్రబాబు నాయుడు
ఈ టాపిక్ రాగానే మొదట గుర్తు వచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నాం. ఒకటే రకమైన డ్రెస్ చంద్రబాబు నాయుడు గారు వేసుకుంటూ ఉంటారు. పసుపు రంగులో ఉన్న దుస్తులని చంద్రబాబు నాయుడు గారు ధరిస్తారు. అందుకు ఒక కారణం కూడా ఉంది. అదేంటంటే, పసుపు రంగు అనేది తెలుగు దేశం పార్టీ జెండాకి సంకేతం. ఈ కారణంగానే ఆ కలర్ దుస్తులు వేసుకుంటారు. కేవలం దుస్తుల విషయంలో మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే రకమైన ఆహారం తినడం, ఒకటే రకమైన రొటీన్ ఫాలో అవ్వడం చేస్తూ ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ సమయాన్ని కేటాయించడం ఇష్టం లేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట.
#2 డీన్ కామెన్
అమెరికన్ వ్యాపారవేత్త, ఇంజనీర్, రెండు చక్రాలతో నడిచే సెగ్వేని కనిపెట్టిన డీన్ కామెన్ కూడా బ్లూ డెనిమ్ జీన్స్ షర్టు, బ్లూ డెనిమ్ జీన్స్ ప్యాంట్ వాడుతారు. పనిచేయడానికి సులభంగా ఉండే దుస్తులు వేసుకోవాలి అని ఇలాంటి దుస్తులు వేసుకుంటారట.
#3 క్రిస్టోఫర్ నోలన్
అంతర్జాతీయ డైరెక్టర్, ఆస్కార్ విజేత క్రిస్టోఫర్ నోలన్ బ్లూ షర్ట్, దాని మీద ఒక బ్లేజర్ వేసుకుంటారు. అందుకు పెద్దగా కారణం ఏమీ లేదు. రోజు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనే ఆలోచన మీద ఎక్కువ సమయం గడపడం ఇష్టం లేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.
#4 స్టీవ్ జాబ్స్
ఆపిల్ మాజీ సీఈఓ అయిన స్టీవ్ జాబ్స్ కూడా బ్లాక్ కలర్ టర్టిల్ నెక్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ వేసుకునేవారు. కంపెనీలో పనిచేసే వారికి, యజమానులకి మధ్య ఒక మంచి సాన్నిహిత్యాన్ని ఏర్పరచడానికి, స్నేహపూర్వకంగా ఉంటుంది అని ఇలాంటి సింపుల్ దుస్తులని ఇష్టపడే వారట.
#5 మార్క్ జాకెర్బర్గ్
ఫేస్ బుక్ అధినేత మార్క్ జాకెర్బర్గ్ కూడా గ్రే కలర్ సూట్ వేసుకుంటూ ఉంటారు. వృత్తి గురించి తప్ప మిగిలిన విషయాలన్నిటి గురించి నిర్ణయాలు తీసుకోవడానికి తక్కువ సమయం కేటాయించాలి అని అనుకుంటారు. అందుకే వాటిపై తన శక్తిని వృధా చేయడం ఇష్టం లేక ఒకే రకమైన బట్టలను వేసుకుంటారట.
#6 బరాక్ ఒబామా
44వ యూఎస్ ప్రెసిడెంట్ అయిన బరాక్ ఒబామా కూడా గ్రే కలర్ సూట్లు కానీ, బ్లూ కలర్ సూట్లు కానీ వేసుకుంటారు. అందుకు కారణం కూడా ఉంది. ఆయన తన నిర్ణయాలు తీసుకునే విషయాలని తగ్గించుకునే ప్రయత్నం చేశారు. అంటే, రోజువారి దినచర్యలో తాను ఏం తినాలి? ఎలాంటి దుస్తులు వేసుకోవాలి అనే విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి అని ఆయన అనుకోలేదు. వాటికంటే ముఖ్యమైన విషయాలు, వాటికంటే ఎక్కువ సమయం కేటాయించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ కారణంగానే ఒకే రకమైన దుస్తులు వేసుకుంటున్నారు.
వీరందరి కారణాల్లో కామన్ కారణం ఒకటే. సమయం ఎక్కువ వృధా చేయకూడదు అని. ఈ టెక్నిక్ ఏదో బాగుంది కదా. సమయాన్ని అంత పొదుపుగా ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే ఖర్చు చేస్తారు కాబట్టే వారు అంత గొప్పవారు అయ్యారు.
ALSO READ : చీరకట్టులో ఎయిర్ పోర్ట్ కి వచ్చినందుకు ఆ మహిళ ఎగతాళి చేసింది…సుధామూర్తి గారి కౌంటర్ హైలైట్.!
End of Article