Ads
సెలబ్రిటీలు ఏం చేసినా సోషల్ మీడియాకు, మీడియాకు పండగే. అందుకే వారు కనిపించగానే హడావిడి చేస్తూ సెల్ఫీలు దిగుతూ.. వారిని ఫోటోలు తీస్తూ ఉంటారు. అలాగే వారికీ సంబంధించిన ప్రతి విషయం పైనా అందరికీ ఆసక్తి ఉంటుంది. వారు ఏం చేసినా అది మీడియాలో వైరల్ అవుతుంది.
Video Advertisement
అందుకే తమ లాగ తమ పిల్లలు కంటెంట్ గా మారకూడదు అని కొంతమంది వారిని కెమెరాలకు చూపించడానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ వారికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసినా వారి మొహాలు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. వారి ప్రైవసి ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు.
ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న సెలెబ్రెటీలు ఎవరో చూద్దాం..
#1 అనుష్క – విరాట్ కోహ్లీ
క్రికెటర్ విరాట్, అనుష్క జంట ఇప్పటివరకు తమ బిడ్డ ఫోటోలను బయటపెట్టలేదు. అయితే ఒక మ్యాచ్ లో అనుకోకుండా వామిక ఫోటో బయటకు రాగా.. ఆ ఫోటోలు డిలీట్ చేసేవరకు ఇద్దరు సెలబ్రిటీల డై-హార్డ్ ఫాన్స్ ఊరుకోలేదు.
#2 నయనతార – విగ్నేష్ శివన్
పెళ్లయిన రెండు నెలలకే కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది నయనతార. తమ పిల్లలు పుట్టినప్పటి నుంచి పలుమార్లు ఎయిర్పోర్ట్స్ లో కనిపించినప్పటికీ వారి మోహాలను దాచేస్తూ వారు ఎలా ఉంటారో ఇప్పటివరకు కెమెరా కళ్ళకు చిక్కనివ్వలేదు.
#3 అలియా భట్ – రణబీర్ కపూర్
ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చిన అలియా, రణబీర్ జంట తమ పాప రాహా కోసం “నో ఫోటో పాలసీ”ని కావాలని కోరారు. “దయచేసి మా పాప ఫోటోలు క్లిక్ చేయకండి. పొరపాటున చిన్నారి ఫ్రేమ్‌పై క్లిక్ చేసినా.. దాన్ని పబ్లిష్ చేస్తే పిల్లల ముఖాన్ని దాచేందుకు హార్ట్ ఎమోజీ వంటి ఎమోజీలను ఉపయోగించాలని” వారు తెలిపారు.
#4 సోనమ్ కపూర్ – ఆనంద్ అహూజా
నటి సోనమ్ కపూర్ గత ఆగస్టులో తన కొడుకుకు జన్మనిచ్చింది. కొడుకు వాయు ముఖాన్ని సోనమ్ ఇంకా చూపించలేదు. తమ బిడ్డకు లోకాన్ని అర్థం చేసుకొనే వయసు వచ్చిన తర్వాత దీని గురించి ఆలోచిస్తామని ఈ జంట తెలిపింది.
#5 ప్రియాంక చోప్రా – నిక్ జోనస్
సరోగసీ ద్వారా తల్లిదండ్రులైన ఈ జంట సోషల్ మీడియా లో తమ బేబీ ఫొటోస్ ని పెట్టినా.. మొహం కనిపించకుండా హార్ట్ ఎమోజి ని ఉపయోగించేవారు. కానీ ఇటీవల జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్ లో తమ బేబీ ఫోటో ని రివీల్ చేసారు.
#6 నేహా దుఫియా- అంగద్
నటులు నేహా దుఫియా, అంగద్ తమ ఇద్దరు పిల్లల ముఖాలను సోషల్ మీడియాలో బయటపెట్టకుండా చూసుకున్నారు. పిల్లలకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేసినా.. వారి ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.
End of Article