“ఏజెంట్” సినిమాలో “సెన్సార్ కట్” అయిన సీన్స్ ఇవే..! మొత్తం ఎన్ని సీన్స్ అంటే..?

“ఏజెంట్” సినిమాలో “సెన్సార్ కట్” అయిన సీన్స్ ఇవే..! మొత్తం ఎన్ని సీన్స్ అంటే..?

by kavitha

Ads

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘ఏజెంట్’ మూవీ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. సురేందర్ రెడ్డి తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది.

Video Advertisement

భారీ బడ్జెట్ తో తెరికెక్కిన ఈ చిత్రంలో మళ‌యాళ మెగాస్టార్ ముమ్ముట్టి ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ మూవీని  టాప్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మించారు. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సెన్సార్ 8 కట్ లు సూచించింది అని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఏజెంట్ సినిమా రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ మరియు హెవీ బ్లడ్ సన్నివేశాలు ఉండడం వల్ల సెన్సార్ A సర్టిఫికెట్ ఇస్తుందనుకున్నారు. కానీ ఈ మూవీకి యూ/ఏ జారీ చేసి, అన్ని వర్గాల ఆడియెన్స్ చూసేందుకు ఏజెంట్ సినిమాకి అనుమతి లభించింది. అయితే ఈ మూవీలో సెన్సార్ 8 కట్ లు సూచించింది అని సమాచారం. అవి ఏమిటంటే..
1. విలన్ వైస్ ప్రెసిడెంట్ శిరచ్ఛేద సన్నివేశాన్ని తొలగించాలని సెన్సార్ బోర్డ్ సూచించింది.

2. పీఎం అనే పదాన్ని, సబ్ టైటిల్ ను కూడా తొలగించాలని సెన్సార్ సూచించింది.

3. నిర్భయ అనే పదాన్ని, సబ్ టైటిల్ ను తొలగించాలని సెన్సార్ సూచించింది.

4. జాతీయ జెండాను సరైన విధంగా చూపించాలని సెన్సార్ సూచించింది.

5. హీరో ముఖం మరియు శరీరం పై రక్తాన్ని తొలగించాలని సెన్సార్ సూచించింది.

6. హిందీ భాషలో ఎక్కువగా వాడే ఒక తిట్టును మ్యూట్ చేసారు.

7. మరొక అభ్యంతరకరమైన తిట్టును కూడా మ్యూట్ చేసారు.

8. అలాగే ఒక ఇంగ్లీష్ తిట్టును కూడా మ్యూట్ చేయమని చెప్పారు.

Also Read: 50 ఏళ్ల వయసుకి దగ్గరగా ఉన్నా…ఇప్పటివరకు “శోభన” ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసా.? కారణం ఆ హీరో.?


End of Article

You may also like