అందం, అభినయం, నటన ప్రతిభ మాత్రమే కాదు అద్భుతమైన నాట్య ప్రదర్శన కూడా చేయగల నటి శోభన. నాట్యానికి ప్రధానమైన అభినయాన్ని పలికించడం లో ఆమె ఆరితేరిపోయారు. అందుకే ఆమెను నాట్యమయూరి అని తెలుగువారు పిలుచుకుంటుంటారు.

Video Advertisement

తెలుగు వారింటి పడచు గా కనిపించే శోభన వాస్తవానికి మలయాళీ నటి. నాట్యం, నటన రంగాల్లో తమ ప్రతిభను చూపించిన పద్మిని, లలితా, రాగిణి ల మేనకోడలు శోభన.

actress sobhana

1984 సంవత్సరం లో “శ్రీమతి కానుక” సినిమా ద్వారా పరిచయం అయింది. ఈ సినిమా లో సుమన్ హీరో. ఆ తరువాత నాగార్జున హీరో గా ‘విక్రమ్’ సినిమా లోను కనిపించింది. చిరంజీవి తో రౌడీ అల్లుడు, బాలకృష్ణ హీరో గా మువ్వ గోపాలుడు వంటి సినిమాల్లో నటించింది. అలాగే, మోహన్ బాబు తో కూడా రౌడీ గారు, అల్లుడుగారు, గేమ్ వంటి సినిమాల్లో నటించింది. ఆమె తెలుగు సినిమాలతో పాటు, తమిళ మలయాళ సినిమాల్లో కూడా నటించింది. రజినీకాంత్ “చంద్రముఖి” సినిమా అసలు మలయాళం మూలం.

actress sobhana chandramukhi

ఫిల్మీ ఫోకస్ కధనం ప్రకారం.. మలయాళం లో  “మణి చిత్ర తాళు” సినిమాలో శోభన అద్భుతమైన నటన ను కనబర్చి ఆ సినిమాకు గాను అవార్డు పొందింది. నాట్యం లో తనకు ఉన్న ప్రతిభ ఎనలేనిది. 1994 సంవత్సరం లో ఆమె “శోభన కళార్పణ” అనే సంస్థను స్థాపించి నాట్యాన్ని విస్తరిస్తోంది. ఎందరో కళాకారిణులు ఆమె వద్ద నాట్యం నేర్చుకుంటున్నారు.

actress sobhana dancer

చాలామంది తెలుగు వారికి ఆమె మలయాళీ అన్న సంగతి తెలియదు. అంత గా ఆమె తెలుగువారితో కలిసిపోయింది. అయితే, ఆమెకు యాభై సంవత్సరాలు వస్తున్నా, ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఈ విషయం గురించి శోభన వద్ద ప్రస్తావించగా, గతం లో హీరోయిన్ గా ఉన్న సమయం లో ఓ  మలయాళ హీరోను ప్రేమించానని, అయితే ఆ హీరో మోసం చేయడం తో జీవితం లో ప్రేమ కు, పెళ్లి కి దూరం గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు శోభన తెలిపారు. అలా అని శోభన ఒంటరి గా జీవితం గడపట్లేదు. ఓ చిన్నారిని దత్తత తీసుకుని ఆమె ఆలనా, పాలన చూసుకుంటోంది.

actress sobhana

ప్రస్తుతం ఆమె నాట్యమే ఆమె లోకం.. తాజాగా, ఓ సినిమా లో కనిపించి సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా ప్రారంభించారు. “వారనే ఆవశ్యముందే” అనే ఓ సినిమా లో శోభన అతిధి పాత్రను పోషించారు. ఈ సినిమా లో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించారు. ఎంతో ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్న నటి శోభన జీవితం లో మరెన్నో విజయాలను అందుకోవాలని కోరుకుందాం.