“చక్రవాకం” సీరియల్ లో నటించిన ఈ 7 మంది ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి! ఏం చేస్తున్నారంటే?

“చక్రవాకం” సీరియల్ లో నటించిన ఈ 7 మంది ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి! ఏం చేస్తున్నారంటే?

by Sainath Gopi

Ads

మన తెలుగు ఆడియన్స్ కి సీరియల్స్ కి ఉన్న కనెక్షన్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు కదా? ఋతురాగాలు నుండి కార్తీక దీపం వరకు అందరిని మన ఇంట్లో మనిషిగా కలిపేసుకుంటాము. సీరియల్ లో క్యారెక్టర్ కి కష్టం వస్తే మనకి వచ్చినట్టు కన్నీళ్లు పెట్టుకుంటాము. అంతలా మునిగిపోతున్నారు మన తెలుగింటి ఆడవాళ్లు సీరియల్స్ లో . “చక్రవాకం” సీరియల్ గురించి కొత్త ఇంట్రడక్షన్ అవసరంలేదు అనుకుంట. ఇప్పటికి ఎందుకో నాకు ఈ ఆశలు అంటూ ఆ సీరియల్ టైటిల్ సాంగ్ పాడుకుంటూనే ఉంటాము. మరోసారి సీరియల్ రిపీట్ అయినా యూట్యూబ్ లో సీరియల్ ట్రేండింగ్ లో ఉంటుంది అంటే అర్ధం చేసుకోండి సీరియల్ రేంజ్ ఏంటో.

Video Advertisement

ప్రేమకథతో అటు యువతని ఇటు పెద్దవారిని ఆకట్టుకున్న చక్రవాకం సీరియల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఈ సీరియల్ డైరెక్టర్స్ మంజులా నాయుడు,బిందునాయుడు..వీరిద్దరూ ఈ కథను రాసుకున్న విధానం,తీసిన తీరే ప్రేక్షకులకు దీన్ని చేరువ చేసింది. ఇక ఈ సీరియల్ లో నటించిన నటీనటులను అయితే ప్రశంసించకుండా ఉండలేము. అయితే అప్పటి ఈ ఆర్టిస్ట్ లు ఇప్పుడు ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారో? ఓ లుక్ వేసుకోండి.

ఇంద్రనీల్:
చక్రవాకం సీరియల్లో ఇంద్ర గా నటించిన నటుడు అసలు పేరు రాజేశ్ బాబు..విజయవాడకు చెందిన రాజేశ్ ఈ సీరియల్ తర్వాత వచ్చిన క్రేజ్ తో ఇంద్రనీల్ గా మారిపోయాడు..అంతేకాదు ఈ సీరియల్లో తనకు అత్తపాత్రలో నటించిన మేఘనరామిని ప్రేమించి ,తనను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.ఈ సీరియల్ తర్వాత ఇంద్ర మొగలిరేకులు కూడా లీడ్ రోల్ పోషించాడు.

ప్రీతి అమీన్
స్రవంతి,ఇంద్రల ప్రేమకథ గురించి మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట. సీరియల్ చూసిన అందరికి తెలిసిందే. ఈ సీరియల్ లో స్రవంతిగా నటించిన ప్రీతి అమీన్ కొన్ని హిందీ ప్రోగ్రామ్స్ కూడ ాచేసేది.ఈ సీరియల్ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది.

సెల్వరాజ్
ఇంద్ర,స్రవంతిల ప్రేమ లానే,ఇక్బాల్ ,స్రవంతి ల స్నేహం కూడా ఈ సీరియల్లో అందరిని ఆకట్టుకున్న అంశం. ఈ సీరియల్ లో ఇక్బాల్ పాత్రలో నటించిన సెల్వరాజ్ తర్వాత మొగలిరేకులు లో సెల్వ గా మరింత పేరు తెచ్చుకుని ఇప్పుడు సినిమా అవకాశాలు చాలానేతెచ్చుకున్నాడు. మరిన్ని సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు.

శృతి
రుతురాగాలు, మొగలిరేకులు, ,చక్రవాకం శృతి చేసిన సీరియల్స్ లో కొన్ని ఈమె మంజులానాయుడు మొదట దూరదర్శన్ లో చేసిన కాల చక్రం సీరియల్లో కూడా చేసింది.ఈమె భర్త మధుసూదన్,తల్లి నాగమణి కూడా నటులే..ఇప్పుడు మరికొన్ని సీరియల్స్ చేస్తున్నారు శృతి.

మేధా
చక్రవాకం సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన మేధా ఈ సీరియల్ తర్వాత మొఘలిరేకులు లో కీర్తన గా కూడా అందరి ఆధారభిమానాలు పొందింది.పెళ్లి చేసుకుని సీరియల్స్ కి దూరమైన మేధకి ఇప్పుడు ఒక బాబు. మీ శ్రేయోభిలాషి సినిమాలో రాజేంద్రప్రసాద్ కూతురుగా కూడా నటించింది మేధా.

సాగర్
చక్రవాకంలో సాగర్ కనపడినా సాగర్..ఆ తర్వాత మొగలిరేకకులులో ఆర్కె గా,మున్నాగా ఎంత క్రేజ్ సంపాదించారో అందరికి తెలిసిందే..సీరియల్స్ తర్వాత వెండితెరపై తన అదృష్టాన్ని పరిక్షించుకున్నారు సాగర్. మిస్టర్ ఫర్పెక్ట్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సాగర్ తర్వాత రెండు సినిమాల్లో నటించారు.ఇప్పుడు పెళ్లిచేసుకుని కొంచెం గ్యాప్ తీసుకున్నట్టున్నారు.

పావని
చక్రవాకం సీరియల్ కి ముందుగానే పావని సీరియల్ ఆర్టిస్ట్ గా గుర్తింపుపొందింది.కానీ ఈ సీరియల్ తర్వాత అవకాశాలు కూడా ఎక్కువే వచ్చాయి.స్టూడెంట్ నం.1 సినిమాలో కనిపించింది పావని. ప్రస్తుతం పెళ్లిచేసుకుని కుటుంబాన్ని చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా గడిపేస్తుంది పావని.

లహరి
ఈ సీరియల్ తర్వాత ఎక్కువ బెనిఫిట్ పొందిన ఆర్టిస్ట్ ఎవరన్నా ఉన్నారా అంటే అది లహరి మాత్రమే అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు.. ఈ సీరియల్ తర్వాత వరుసబెట్టి ఆఫర్లు రావడమే కాదు వాటన్నింటిని సద్వినియోగం చేసుకుంది లహరి మొగలిరేకులు,ఆరాదన,ముద్దుబిడ్డ,లయ సీరియల్స్లో నటించడమే కాదు,సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు కూడా కొన్ని సీరియల్స్ లో నటిస్తుంది లహరి.


End of Article

You may also like