తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర సంగీత దర్శకుడిగా కొనసాగిన వారిలో చక్రి ఒకరు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన చక్రి మ్యూజిక్ పై ఉన్న ఆసక్తితో ఎంతో కష్టపడి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు. ఆయన కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు.
Video Advertisement
డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్, శివమణి, దేశముదురు వంటి చిత్రాలకు చక్రి సమకూర్చిన సంగీతం ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు చక్రి లేకపోయినా ఆయన మ్యూజిక్ అందించిన సాంగ్స్ ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. చక్రి సోదరుడు అయిన మహిత్ నారాయణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన అన్నయ్య చక్రి ఉన్న సమయంలో ఎటువంటి గొడవలు లేవని, అయితే ఆయన మరణించిన తరవాత తమ ఫ్యామిలిలో ఆస్తి గొడవలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. అన్నయ్య చక్రి పోయిన బాధలో ఉన్నప్పుడే మొదలైన గొడవలతో తాము నరకం అనుభవించామని తెలిపారు. అన్నయ్య సంపాదించిన ఆస్తుల్లో ఆయన భార్య కొన్నింటిని అమ్మేసిందని తెలిపారు. ఆమె అమెరికా వెళ్లిందని, మళ్ళీ వివాహం చేసుకుని, అక్కడే సంతోషంగా సెటిల్ అయ్యిందని వెల్లడించారు. తమకు చెందిన కొన్ని ఆస్తులు ఇప్పటికి కోర్టు కేసుల్లోనే ఉన్నాయని చెప్పారు.
ఇదిలా ఉంటే 2014లో చక్రి గుండె పోటుతో కన్నుమూశారు. ఆయనకు ఊబకాయ సమస్య ఉండేదని, ఆ కారణంతోనే చిన్న వయసులోనే చక్రి గుండెపోటుతో మరణించారు. ఇక ఆయన మరణించిన వెంటనే వారి ఫ్యామిలిలో ఆస్తుల గొడవలు ప్రారంభం అయ్యాయి. చక్రి భార్య ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తనను వేధిస్తున్నట్టుగా ఆరోపించారు. ఇంకో వైపు చక్రి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చక్రి భార్య పై ఆరోపణలు చేసిన విషయం అందరికి తెలిసిందే.
Also Read: “సందీప్ రెడ్డి వంగా” నుండి… “శ్రీకాంత్ ఓదెల” వరకు… “మొదటి సినిమా” తోనే హిట్ కొట్టిన 15 డైరెక్టర్స్..!