ఇండస్ట్రీ లో ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టడం అనేది ప్రతి డైరెక్టర్ కి ఛాలెంజ్ లాంటిది. ఆ సినిమా వారి భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. దీంతో ఆ చిత్రాలను చాలా జాగ్రత్తగా తీస్తారు డైరెక్టర్స్. అలా మన టాలీవుడ్ లో కొందరు తెలుగు డైరెక్టర్స్ తమ ఫస్ట్ మూవీస్ తో సెన్సేషనల్ హిట్స్ తీశారు. అలా తీసిన వారిలో కొందరు తమ రెండో సినిమాతో ఏకంగా స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసారు.
Video Advertisement
తమ ఫస్ట్ సినిమాతోనే సెన్సేషనల్ హిట్స్ కొట్టి ఇండస్ట్రీ లో పాతుకుపోయిన దర్శకులెవరో ఇప్పుడు చూద్దాం..
#1 రాజమౌళి
ఎన్టీఆర్ తో ‘స్టూడెంట్ నెంబర్ 1 ‘ మూవీ తీసి.. తొలి చిత్రం తోనే హిట్ కొట్టాడు రాజమౌళి. ఇక అప్పటినుంచి వెనుతిరిగి చూసుకోలేదు జక్కన్న.
#2 పూరి జగన్నాథ్
పవన్ కళ్యాణ్ తో ‘బద్రి’ మూవీ తీసిన పూరి జగన్నాథ్ తొలి చిత్రం తోనే ఇండస్ట్రీ లో తన ముద్ర వేశారు.
#3 త్రివిక్రమ్
తరుణ్, శ్రీయ జంటగా వచ్చిన చిత్రం ‘నువ్వే నువ్వే’. అంతకుముందు మాటల రచయితగా పని చేసిన త్రివిక్రమ్ ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయం అయ్యి సూపర్ హిట్ కొట్టాడు.
#4 క్రిష్
అల్లరి నరేష్, శర్వానంద్, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘గమ్యం’ చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు క్రిష్. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
#5 అవసరాల శ్రీనివాస్
నాగ శౌర్య, రాశి ఖన్నా జంటగా వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం తో దర్శకుడిగా మారారు నటుడు అవసరాల శ్రీనివాస్. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
#6 హను రాఘవపూడి
రాహుల్ రవీంద్ర, లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘ అందాల రాక్షసి’ చిత్రం తో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు హను రాఘవపూడి. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
#7 శ్రీకాంత్ ఓదెల
సుకుమార్ శిష్యుడిగా పని చేసిన శ్రీకాంత్ ఓదెల.. నాని తో ‘దసరా’ మూవీ తీసి హిట్ కొట్టారు.
#8 వెంకటేష్ మహా
‘కేరాఫ్ కంచర పాలెం’ చిత్రం తో మొదటి ప్రయత్నం లోనే హిట్ కొట్టాడు వెంకటేష్ మహా.
#9 చందు మొండేటి
‘కార్తికేయ’ చిత్రాన్ని తీసిన చందు మొండేటి.. తొలి చిత్రం తోనే హిట్ ని తన ఖాతా లో వేసుకున్నాడు.
#10 తరుణ్ భాస్కర్
విజయ్ దేవరకొండ హీరోగా ‘పెళ్లి చూపులు’ చిత్రాన్ని తెరకెక్కించాడు తరుణ్ భాస్కర్. ఈ మూవీ తో హిట్ కొట్టాడు.
#11 సుజీత్
శర్వానంద్ హీరోగా వచ్చిన ‘ రన్ రాజా రన్’ చిత్రం తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుజీత్. ఈ మూవీ సూపర్ హిట్ అయింది.
#12 వెంకీ అట్లూరి
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘తొలిప్రేమ’ మూవీ కి దర్శకత్వం వహించాడు వెంకీ అట్లూరి. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
#13 సుధీర్ వర్మ
నిఖిల్ హీరోగా ‘స్వామి రా రా’ చిత్రాన్ని తీశారు సుధీర్ వర్మ. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తో నిఖిల్ కెరీర్ బూస్ట్ అయ్యింది.
#14 శైలేష్ కొలను
నాని నిర్మాతగా వచ్చిన ‘హిట్’ మూవీ శైలేష్ కొలను దర్శకుడు. తన తొలి చిత్రం తోనే హిట్ ని ఖాతా లో వేసుకున్నాడు శైలేష్ కొలను.
#15 అజయ్ భూపతి
తన తొలి చిత్రం ‘ఆర్ ఎక్స్ 100 ‘ మూవీ తో విజయాన్ని అందుకొని.. ఇండస్ట్రీ ని తన వైపు తిప్పుకున్నాడు అజయ్ భూపతి.