చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థ శాస్త్రం లో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు.

Video Advertisement

చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది. చాణక్యుడు స్నేహితుల గురించి కూడా ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిని కనుక అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం లో ముందుకు వెళ్ళిపోవచ్చు.

అయితే మీరు ఆనందంగా ఉండాలి అనుకుంటే ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలి. అయితే మరి మీరు ఆనందంగా ఎలా ఉండొచ్చు ..? ఎటువంటి వాళ్లకు దూరంగా ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని ఆచరిస్తే ఆనందంగా ఉండేందుకు అవుతుంది.

#1. మధురంగా మాట్లాడే వాళ్ళు:

కొంత మంది అతి మధురంగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య అంటున్నారు. బాగా మధురంగా మాట్లాడే వాళ్ళ మనసులో కుట్ర మాత్రమే ఉంటుందని చాణక్య చెప్పారు. కనుక ఇటువంటి వ్యక్తులకు దూరంగా ఉంటే మంచిది. లేక పోతే ఆనందంగా ఉండలేరు. చూడడానికి మధురంగా వున్నా సరే వారి వలన సమస్యలే.

#2. చెడు గుణం కలిగిన వారు:

చెడు గుణం ఉన్న వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి. అలాంటి గుణం వల్ల మనం కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలానే అలాంటి గుణం వలన వారికి కూడా ఇబ్బందే.

#3. ఏది చెప్పని వాళ్ళు:

ఏది చెప్పని వాళ్ళ యొక్క మనసు లో అంతా కుట్రే ఉంటుంది. అటువంటి వాళ్లకి కూడా దూరంగా ఉండాలి.

#4. తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేసేవారు:

మనం తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ఎవరైనా చేస్తున్నట్లయితే వారికి కూడా దూరంగా ఉండాలి అని చాణక్య నీతి చెబుతోంది. కనుక తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేసే వారి నుండి కూడా దూరంగా వుండండి.