చాణక్యుడు ఎన్నో విషయాలని మనతో చెప్పారు. నిజానికి వాటిని మనం అనుసరిస్తే మన జీవితం ఎంతో బాగుంటుంది. పైగా ఆయన ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు ఇప్పటికీ ఎంతో మంది అనుసరిస్తున్నారు. చాణక్య మంచి రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు.

Video Advertisement

ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా చాణక్యుడు వివరించారు. స్త్రీల గురించి మాత్రమే కాక పురుషుల గురించి కూడా ఎన్నో గొప్ప విషయాలు చాణక్య చెప్పారు.

వాటిని కనుక అనుసరిస్తే ఎలాంటి మనం అనుసరిస్తే ఏ ఇబ్బందులు లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళిపోవచ్చు. అయితే ఇలాంటి పురుషులు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని.. ఇలాంటి పురుషులు మళ్ళీ పెళ్లి చేసుకోవడం లో ఏ మాత్రం తప్పు లేదు అని చాణక్య చెప్పారు. మరి ఎటువంటి పురుషుడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

#1. పిల్లలని కనలేని స్త్రీ భార్య అయితే:

మీ భార్య కనుక పిల్లల్ని కనలేదు అంటే కచ్చితంగా మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని చాణక్య చెప్పారు కాబట్టి పిల్లలని కనలేని స్త్రీ కనుక మీ జీవితంలోకి వస్తే మళ్లీ పెళ్లి చేసుకోవచ్చట.

#2. వంశోద్ధారకుడిని ఇవ్వనప్పుడు:

ఒకవేళ కనుక మీ భార్య పిల్లలకు జన్మనిచ్చినా వంశోద్ధారకుడు ఒకవేళ లేకపోతే ఆ పురుషుడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని ఆచార్య చాణక్య అంటున్నారు.

#3. గర్భ విచ్చిత్తి జరుగుతున్నప్పుడు:

గర్భవిచ్చితి ఎప్పటికప్పుడు జరుగుతున్నప్పుడు కూడా ఆ పురుషుడు వంశం కోసం మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని చాణక్యనీతి చెబుతోంది కానీ పెళ్లయి ఎనిమిదేళ్లు దాటితే మాత్రం పెళ్లి చేసుకోకూడదని చాణక్య చాణక్యనీతి ద్వారా చెప్తున్నారు. అదే విధంగా మళ్లీ పెళ్లి చేసుకోవాలని పురుషుడు నిర్ణయం తీసుకుంటే మొదటి భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంటుంది. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం కూడా తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని ఆచార్య చాణక్య చెప్తున్నారు. అయితే ఇవన్నీ అప్పుడు పరిస్థితులకి తగ్గట్టుగా చాణక్య చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం రోజులు మారిపోయాయి. ఇవి కేవలం ఆ రోజుల్లో ఉండే సమస్యల బట్టే రాసారు.