Ads
చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి. చాణిక్య నీతి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెబుతోంది. అలాగే డబ్బు సంపాదన విషయమై కూడా చాణక్య నీతి మనకు చాలా విషయాలను నేర్పిస్తుంది.
Video Advertisement
తాజాగా.. ఇంట్లో జరిగే సంఘటనల విషయంలో జాగ్రత్త పడాలని చాణుక్యుడు హెచ్చరిస్తున్నాడు. మీ ఇంట్లో ఈ ఐదు సంఘటనలు జరిగాయేమో చెక్ చేసుకోండి. ఒకవేళ జరిగితే మాత్రం అప్రమత్తంగా ఉండండి.
#1.తులసి మొక్క వాడిపోవడం: తులసి మొక్క ఎంతో పవిత్రమైనది. అయితే.. ఇంట్లో ఉండే తులసి మొక్క నెగటివ్ ఎనర్జీని గ్రహించగలుగుతుంది. అందుకే ఇంట్లో ఉన్న తులసి మొక్క వాడిపోతే అది అశుభ సూచకంగా భావించాలి. ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే.. ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
#2. తరచూ గాజు పగిలిపోతుండడం :
ఇంట్లోని గాజు వస్తువులు, అద్దం లాంటి వస్తువులు తరచుగా పగిలిపోతున్నాయా..? ఇంట్లో గాజు వస్తువులు పగులుతూ ఉంటె.. అది ఇంట్లో ఆర్ధిక పరిస్థితికి చేటు కలిగిస్తుంది. మరింత పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
#3. పెద్దలను అవమానించడం: ఇంట్లోని పెద్దలను తరచూ అవమానిస్తున్నారా..? ఇది కావాలని చేయకపోయినా.. అస్సలు మంచిది కాదు. పెద్దల పట్ల గౌరవ భావం కలిగి ఉండాలి. పెద్దలను అవమానించిన ఇంట్లో ఆనందం, శ్రేయస్సు రెండూ నిలవవు.
#4. తరచూ గొడవలు జరుగుతుండడం: ఏ ఇంట్లో అయినా తరచుగా గొడవలు జరుగుతుండడం మంచిది కాదు. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడదు. అలాంటి ఇంట్లో నివసించేవారు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నా అపజయాలనే ఎదుర్కోవాల్సి వస్తుంది.
#5. నిత్య పూజ:
కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రతి ఇంట్లో నిత్యపూజను తప్పని సరిగా చేయాలి. ఇంట్లో నిత్య దీపారాధన, నిత్య పూజ జరిగితే.. ఆ ఇల్లు శుద్ధి అయ్యి ఇంట్లోని వారికి మంచి బుద్ధులు అలవడతాయి.
End of Article