చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు.

Video Advertisement

చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది. చాణక్యుడు స్నేహితుల గురించి కూడా ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిని కనుక అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళిపోవచ్చు. అయితే ఈరోజు అందం, తెలివి, సంపద కి సంబంధించి ముఖ్యమైన విషయాలని చాణక్య నీతి ద్వారా చాణక్య చెప్పారు. మరి అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

#1. ధర్మం లేని వ్యక్తి:

ధర్మం లేని వ్యక్తి కి అందం ఎందుకు..? ధర్మం లేని వ్యక్తి కి అందం వున్నా అది వృధానే అని ఆచార్య చాణక్య చెప్పారు.

#2. జ్ఞానం ఉండి కూడా గెలవని వ్యక్తి:

జ్ఞానం ఉండి కూడా గెలవని వ్యక్తి ఉంటే ఆ తెలివి వృధానే అని ఆచార్య చాణక్య అంటున్నారు. నిజానికి జ్ఞానం ఉంటే ఎవరైనా గమ్యాన్ని చేరుకోవడానికి అవుతుంది. కానీ ఆ వ్యక్తి కనుక చేరుకో లేదు అంటే ఆ వ్యక్తి తెలివి వృధా ఏ అంటున్నారు చాణక్య.

chanakya

#3. సక్రమంగా ఉపయోగించని ధనం:

సక్రమంగా ఉపయోగించని ధనం కూడా వృధానే. అలాంటి ధనం ఎందుకు అని చాణక్య అంటున్నారు. నిజానికి శరీర సౌందర్యానికి మనిషి లో వుండే గుణాలకి సంబంధం లేదు అని చాణక్య అంటున్నారు.