Ads
ప్రతి మనిషి జీవిత కాలంలో గొప్ప ఘట్టం అనేది పెళ్లి. పూర్వకాలంలో పెళ్లి అనేది నూరేళ్ళపంట గా భావించేవారు. అయితే ఇప్పటి తరానికి పెళ్లి పైన వివాహ వ్యవస్థ పైన నమ్మకం అనేది ఉండటం లేదు.
Video Advertisement
కారణం ఏదైనా కావచ్చు కానీ రకరకాల సమస్యలతో భార్యాభర్తలు విడిపోతున్నారు. వాళ్ల జీవితాలతో పాటు వాళ్లకు పుట్టిన సంతానం జీవితాల్లో కూడా నాశనం చేస్తున్నారు. భార్యాభర్తల దాంపత్యం సవ్యంగా సాగాలంటే అస్సలు చేయకూడని పనులు ఏమిటో చాణిక్య నీతిలో వివరించబడింది. చాణిక్య నీతి అనుసరింస్తే వారి దాంపత్యం బలంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య దూరం పెరగకుండా ఉండడానికి ఆచార్య చాణిక్యుడు చెప్పిన నీతి ఏంటో తెలుసుకుందాం
1. రహస్యాలను పంచుకోవడం :
భార్యభర్తల బంధం అనేది ఎంతో విలువైనది, సున్నితమైనది. కొన్ని విషయాలలో వాళ్ల మధ్య ఒక పరిధి అనేది ఉంటుంది. ఎవరి రహస్యాలు వారి దగ్గర ఉంచుకోవడమే మంచిది. వాళ్ళ మధ్య జరిగే విషయాలను ఇతరులతో పంచుకోవడం అనేది జీవిత భాగస్వామికి బాధ కలగవచ్చు. ఇతరులతో తమ మధ్య జరిగే విషయాలను పంచుకోవడం ద్వారా భార్యభర్తల అనుబంధం అనేది బలహీనపడుతుంది. తద్వారా ఆలూమగల మధ్య తగాదాలకు దారితీస్తుంది.
2. ఒకరినొకరు కించ పరుచు కోవడం :
భార్యాభర్తల్లో ఎవరైనా ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెప్పడం అనేది చాలా ప్రమాదకరమైనది. ప్రతి చిన్న చిన్న విషయానికి జీవిత భాగస్వామిని కించపరిచే విధంగా మాట్లాడడం ద్వారా, భార్యాభర్తల అనుబంధం అనేది బలహీనపడుతుంది. ఈ సమస్య భార్యాభర్తలు విడిపోవడానికి ప్రధాన కారణంగా మారుతుంది.
3. అసత్యాలు చెప్పుకోవడం :
భార్య భర్తల బంధం అనేది నమ్మకంపై కట్టుకున్న కోట వంటిది. భార్యాభర్తలు ఒకరికి ఒకరు అసత్యాలు చెప్పుకుంటే వారి వైవాహిక జీవితంలో చీలికలు ఏర్పడతాయి. ఏదైనా విషయంపై వారు చెప్పిన మాట అసత్యమని తెలిస్తే, వారి భాగస్వామి మీద నమ్మకం అనేది కోల్పోతారు. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య అనుమానం అనే భూతం మొదలవుతుందో, అప్పుడు వాళ్ళ మధ్య సంబంధం దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుంది.
4. సఖ్యత లేకపోవడం :
అగ్నిలో నెయ్యి పోస్తే ఎలా రగిలిపోతున్నదో, అదేవిధంగా కోపంలో ఉన్న వ్యక్తిని మరింత రెచ్చగొడితే కోపం అనేది పెరుగుతుంది. ఆ కోపంలో వాళ్లు ఎలాంటి కీడును తలపెడతారు అనేది ఊహకు కూడా అందని విషయం. సరియైన సమతుల్యత లేకపోవడం వలన కోపంలో ఎలాంటి హాని అయినా చేయవచ్చు.
5. మూడో వ్యక్తిని ఆహ్వానించడం: దాంపత్య జీవితం అనేది నమ్మకంతో నిజాయితీగా సాగవలసిన పవిత్ర బంధం. ఎప్పుడైతే దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రవేశిస్తారో, వారి దాంపత్య బంధం చెడుగా ముగిసే అవకాశం ఎక్కువ.
End of Article