Ads
సినీ ఇండస్ట్రీ లో హీరోలకు సహజం గానే బిరుదులు పెట్టేస్తూ ఉంటారు. కొన్ని సినిమాలు హిట్ కొట్టి సక్సెస్ రేట్ వచ్చాక వారి అభిమానులు, దర్శకులు వారికి బిరుదులు ఇచ్చేస్తూ ఉంటారు. అయితే.. కొన్ని సినిమాల తరువాత.. వారు మరింత గా ముందుకు దూసుకెళ్తుంటే.. వారికి వచ్చే బిరుదులు కూడా మారుతూ వస్తాయి.. అలా.. ఒకప్పుడు ఉన్న బిరుదులతో పాటు కొత్త బిరుదులు సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరోల లిస్ట్ పై మీరూ ఓ లుక్ వేయండి.
Video Advertisement
1. నందమూరి బాలకృష్ణ:
నందమూరి హీరో బాలకృష్ణ కు మొదట్లో యువరత్న అనే బిరుదు ఉండేది. వరుస హిట్ లు తరువాత.. నందమూరి బాలకృష్ణను ఆయన అభిమానులు నటసింహం అనే పేరుతొ పిలుచుకుంటున్నారు. బాలకృష్ణను సింహ సినిమా నుంచి నటసింహం అని పిలుచుకుంటున్నాం..
2. కృష్ణ:
మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో కృష్ణకు మొదట్లో “నటశేఖర” అనే బిరుదు ఉండేది. ఆ తరువాత ఆయనను “సూపర్ స్టార్” అని పిలవడం మొదలుపెట్టారు. “సింహాసనం” అనే సినిమా నుంచి కృష్ణ ను సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు.
3. నాగార్జున:
హీరో అక్కినేని నాగార్జున కు కెరీర్ మొదట్లో యువసామ్రాట్ అనే బిరుదు ఉండేది. ఆ తరువాత “రగడ” సినిమా నుంచి ఆయనను కింగ్ నాగార్జున అని పిలవడం స్టార్ట్ చేసారు.
4. చిరంజీవి:
చిరంజీవికి సినిమా ప్రపంచానికి ఎనలేని సంబంధం ఉంది. చిరు కెరీర్ మొదట్లో.. ఆయనను డైనమిక్ హీరో అని పిలుచుకునే వారు. ఆ తరువాత ఆయనకు సుప్రీం హీరో అనే బిరుదును ఇచ్చారు. తరువాత కలం లో “మరణ మృదంగం” సినిమా నుంచి ఆయనను మెగాస్టార్ అని పిలుస్తూ వస్తున్నారు.
5. ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన అభిమానులు యంగ్ టైగర్ అంటూ ముద్దు గా పిలుచుకుంటుంటారు. శక్తీ సినిమా తో ఆయనకు ఏ 1 స్టార్ అనే బిరుదు కూడా ఆడ్ అయింది.. కానీ.. ఆయన అభిమానులు ఇప్పటికీ యంగ్ టైగర్ అనే పిలుచుకుంటుంటారు.
6. ప్రభాస్:
ప్రభాస్ ను మొదట్లో డార్లింగ్ అనీ, యంగ్ రెబెల్ స్టార్ అని పిలిచేవారు. పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ను ఇప్పుడు రెబెల్ స్టార్ అని పిలుస్తున్నారు.
9. మహేష్ బాబు:
మహేష్ బాబు ను ఆయన కెరీర్ ప్రారంభం లో ప్రిన్స్ అని పిలిచేవారు. “పోకిరి” సినిమా తరువాత నుంచి ఆయనను సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు.
8. నరేష్:
హీరో నరేష్ ను ఇప్పటి వరకు అందరు అల్లరి నరేష్ అనే పిలుస్తూ వచ్చారు. రీసెంట్ గా “నాంది” సినిమా తో ఆయన కొత్త గా కనిపించి “నాంది” నరేష్ అని పిలిపించుకుంటున్నారు.
9. రవితేజ:
మాస్ సినిమాలకు పెట్టింది పేరైన రవితేజ ను మొదట్లో మాస్ హీరో అని పిలుచుకునే వారు. “మిరపకాయ్” సినిమా నుంచి రవితేజ ను మాస్ మహారాజ్ గా పిలవడం స్టార్ట్ చేసారు.
10. బన్నీ:
నిన్న మొన్నటి వరకు.. బన్నీ ని స్టయిలిష్ స్టార్ అని పిలుస్తూ వచ్చాం.. తాజాగా.. ఆయన హీరో గా నటిస్తున్న పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ లో బన్నీ కి దర్శకుడు సుకుమార్ ఐకాన్ స్టార్ అనే బిరుదుని ఆడ్ చేసారు.
End of Article