మనిషి చనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను కలిపి కడతారు ఎందుకు? కారణం ఇదే.!

మనిషి చనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను కలిపి కడతారు ఎందుకు? కారణం ఇదే.!

by Mohana Priya

Ads

భారతీయ సంస్కృతి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆచారాలు. భారతీయులందరూ ఎన్నో ఆచారాలను పాటిస్తారు. కానీ అలా పాటించే ఆచారాలలో కొన్నిటికి మాత్రమే మనం ఎందుకు పాటిస్తున్నామో అనే కారణం తెలుసు. మనిషి చనిపోయిన తర్వాత చేసే అంత్యక్రియల్లో ఎన్నో ఆచారాలు ఉంటాయి. మామూలుగా మనం అవన్నీ పాటిస్తాం. ఎందుకు పాటిస్తున్నామంటే మన పూర్వీకులు, లేదా మన తాతలు కూడా పాటించారు కాబట్టి. సాధారణంగా ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం ఉంటుంది.

Video Advertisement

మనలో చాలా మంది అలాంటి అర్ధాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించం. దానికి కారణాలు మనం బిజీగా ఉండడం, లేదా తెలుసుకోవాలన్న ఆసక్తి లేకపోవడం ఇలా ఏవైనా కావచ్చు. అంత్యక్రియల సమయంలో చేసే ఒక పని శవానికి కాలి రెండు బొటన వేళ్ళు కలిపి దారం తో కట్టడం. ఇలా చేయడానికి వెనకాల ఒక కారణం ఉంది.

మనిషి చనిపోయిన తర్వాత శరీరం నుండి ఆత్మ వేరే పోతుంది అన్న విషయం అందరికి తెలిసిందే. కానీ చనిపోయిన తర్వాత కూడా తన ఆత్మ ఇంకా బతకాలి, తన వాళ్లతో ఉండాలి అని ఆరాట పడుతూ ఉంటుంది.  మనిషి లోకి ప్రవేశించి తిరిగి తన జీవితంలోకి వెళ్లిపోవాలి అనుకుంటూ ఉంటుంది.

దాంతో శవం లోకి దూరి లేచి మళ్ళీ తన ఇంట్లోకి వెళ్లి పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా ప్రయత్నిస్తున్నప్పుడు కాళ్లను కదలకుండా ఉంచటానికి ఒక తాడు లేదా దారం తో రెండు బొటన వేళ్లను కట్టేస్తారు. ఇది హిందూ ఆచారం ప్రకారం ఆ పద్ధతి కి గల కారణం. కానీ లాజికల్ గా దీనికి ఇంకో కారణం ఉంది.

లాజిక్ ప్రకారం చనిపోయిన తర్వాత శరీరం బిగుసుకుపోతుంది. దాంతో చలనం ఉండదు కాబట్టి కాళ్లు పక్కకి పడిపోతుంటాయి. అలా అవ్వకుండా ఉండడానికి రెండు కాళ్లను కలిపి కట్టేస్తారు.ఆచారం ప్రకారం అయినా, లాజిక్ ప్రకారమైనా కాళ్లు రెండూ కలిపి కట్టడానికి వెనుక ఉన్న కారణం మాత్రం బలమైనది.


End of Article

You may also like