ఆర్తి అగర్వాల్.. చిన్న వయసులోనే టాప్ పొజిషన్ కు చేరుకున్న కధానాయిక. ఆమె ఎంత తొందరగా లైఫ్ లో పైకొచ్చిందో.. అంతే తొందరగా తిరిగి రాని లోకాలకు చేరుకుంది. టాలెంట్, అందం ఉండి.. చిన్నవయసులోనే ఆమెకు అలాంటి పరిస్థితి ఎదురైంది. ఆమె దూరమవడాన్ని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ జీర్ణించుకోలేరు.

2arthi

చిన్న వయసులోనే ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు అందరు స్టార్ హీరోల సరసన ఆమె నటించింది. వెంకటేష్, చిరంజీవి, తరుణ్, ఎన్టీఆర్, ప్రభాస్.. ఇలా అందరి పక్కన నటించి మెప్పించింది. అయితే.. ఆమె పై చెప్పలేనన్ని రూమర్లు కూడా ఉన్నాయి. తరుణ్ తో ప్రేమ వ్యవహారం, ఆత్మహత్యకు ప్రయత్నించడం వంటివన్నీ.. ఆమె కెరీర్ ను పాడు చేసాయి.

3arthi

తాజాగా, నిర్మాత చంటి అడ్డాల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఆర్తి అగర్వాల్ పై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఆమె కెరీర్ ఫేడ్ అవుట్ అవ్వడానికి ఆమె తండ్రే కారణమంటూ వ్యాఖ్యలు చేసాడు. ఆమె ఏ మూవీ షూటింగ్ కి వచ్చినా కూడా వచ్చేవాడిని, ఆర్తి ని పని చేసుకోనిచ్చేవాడు కాదని చెప్పుకొచ్చారు.

1arthi agarwal family

ఆయన రానప్పుడు ఆర్తి బాగానే పని చేసేదని.. ఆమె తండ్రి వచ్చినప్పుడు మాత్రం కంఫర్ట్ గా వర్క్ చేసేది కాదని చెప్పుకొచ్చారు. ఆర్తి అగర్వాల్ ఎక్కువ గా పేరెంట్స్ పై డిపెండ్ అయ్యేదని చెప్పుకొచ్చారు. బరువు తగ్గడం కోసం ఆమె చేయించుకున్న సర్జరీ వికటించడం తో ఆమె గుండెపోటు తో మరణించిన సంగతి తెలిసిందే.