కోట్ల ఆస్తికి వారసురాలు..రోడ్డుపైన బొమ్మలేసుకునేవాడిని ప్రేమించింది..ప్రేమంటే ఇదేరా అనిపించే రియల్ స్టోరీ..!

కోట్ల ఆస్తికి వారసురాలు..రోడ్డుపైన బొమ్మలేసుకునేవాడిని ప్రేమించింది..ప్రేమంటే ఇదేరా అనిపించే రియల్ స్టోరీ..!

by Anudeep

Ads

ఈరోజుల్లో ప్రేమంటే కేవలం ఓ సరదా అయిపొయింది. డబ్బు, అందం, కులం వంటివి చూసుకుని లెక్కలేసుకుని ముందుకెళ్లే వ్యాపారం అయిపొయింది. కానీ, నిజానికి ప్రేమకి ఇవేమి అవసరం లేదని ఓ ప్రేమ జంట నిరూపించింది.

Video Advertisement

charlet-nandia-love-story-feature

ఆమె కోట్ల ఆస్తి కి వారసురాలు. ఆమె జీవిత కాలమంతా ట్రావెల్ చేస్తూ గడిపేసినా తరగని ఆస్తి ఆమె సొంతం. కానీ ఆమె ఢిల్లీ వీధుల్లో రోడ్లమీద బొమ్మలు వేసుకునే అబ్బాయిని ప్రేమించింది. వీరి ప్రేమ కథను తెలుసుకోవాలంటే మనం 1975 రోజుల్లోకి వెళ్లాల్సిందే. 1975 లో చార్లెట్ అనే అమ్మాయి స్వీడన్ నుంచి భారత్ లో పర్యటించడానికి వచ్చింది. ఆమె ఎంతో అందగత్తె. ధనవంతురాలు.

ఆమె ఢిల్లీ లో పర్యటిస్తున్న సమయం లో రోడ్డు పై బొమ్మలు వేసుకుంటున్న మహానందియా అనే వ్యక్తిని చూసింది. తన బొమ్మ కూడా గీయాలి అంటూ అతన్ని కోరింది. అతను అందరికి వేసి ఇచ్చినట్లే ఆమెకు కూడా పదినిమిషాల్లో వేసి ఇచ్చాడు. కానీ, ఆమె తన బొమ్మ నచ్చలేదంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. దీనితో మహానందియా చాల నిరాశ చెందాడు. ఏమైనా సరే, ఆమె మెప్పు పొందాలని మళ్ళీ ఆమెను అడిగి ఆమె చిత్రాన్ని వేయడానికి ప్రయత్నించాడు. నాలుగు గంటల్లో అద్భుతం గా ఆమె చిత్రాన్ని గీశాడు. కానీ ఆమె, బాగుంది లే అని చెప్పి అతనికి ఒక పది రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయింది.

charlet-nandia-love-story

మాములుగా ఎవరైనా వేయించుకుని ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు. ఆమె పది రూపాయలు ఇచ్చింది. కానీ అసంతృప్తి గా ఫీల్ అయ్యాడు. ఆమె తన బొమ్మలను మెచ్చుకోవడం లేదని బాధ పడ్డాడు. ఆ తరువాత అతనికి ఒక విషయం స్ఫూరించింది. తన వద్ద ఉన్న డబ్బులు అన్ని తీసుకుని, తన మూడు రోజుల సంపాదనను తీసుకుని యాభై రూపాయల పెట్టి కలర్ పెన్సిల్స్ ను ఎంతో ఖరీదైనవి కొన్నాడు. ఈసారి ఆమె కనిపించగానే బొమ్మ గీసి అబ్బురపరచాలనుకున్నాడు. ఆమె తన స్నేహితులతో తిరుగుతుండగా, ఆమె వద్దకు వెళ్లి బతిమిలాడి తీసుకువచ్చాడు. మరో రెండు గంటలపాటు కష్టపడి కలర్ ఫోటో తీసినా, అంత అందం గా రాదేమోనన్నట్లు ఆమె బొమ్మను గీశాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆ చిత్రాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తరువాత ఒకసారి వచ్చి… మా స్నేహితులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు వెళ్తున్నాం.. తానూ ఎక్కడకి వెళ్తే బాగుంటుందో చెప్పాలని కోరింది.

దానికి, మహానందియా మా ఊరు వెళ్తే బాగుంటుందని సలహా ఇస్తాడు. మహానందియా కు ఆమెను చూసినప్పుడల్లా వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చేవి. తనది మహార్జాతకం అని, తన జీవితం లోకి కొన్ని వేలమైళ్ల దూరం నుంచి ఒక అమ్మాయి వస్తుందని, వారికి ఒక అడవి ఉంటుందని.. ఆమె నిన్ను పెళ్లి చేసుకుంటుంది అని వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చేవి. చార్లెట్ ను చూసినప్పుడల్లా, నందియా ఆమె ఈమేనని అనుకునేవాడు. ఆమె తన ఊరు రావడానికి ఒప్పుకోవడం తో ఎగిరిగంతేశాడు. తన రాష్ట్రము ఒరిస్సా లో కోణార్క్ టెంపుల్ కి తీసుకెళ్లాడు.

ఆ తరువాత ఆమె ను తన ఇంటికి కూడా తీసుకువెళ్లాడు. అక్కడకి వెళ్ళగానే చార్లెట్ నందియా పేరెంట్స్ తో తానూ నందియా ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. దీనితో మొదట నందియా షాక్ అయ్యాడు. కానీ సైలెంట్ అయిపోతాడు. అయితే, వారి వివాహానికి పేరెంట్స్ అడ్డు చెప్పలేదు. అక్కడే, గిరిజన పద్ధతిలో వారి వివాహాన్ని జరిపిస్తారు. పెళ్లి అయ్యిన తరువాత చార్లెట్ స్వీడన్ కు వెళ్ళిపోతుంది. మరోసారి నందియా ను కూడా స్వీడన్ కు తీసుకువెళ్తానని చెబుతుంది.

అలా ఏడాది కాలం గడుస్తుంది. చార్లెట్ కు నందియా కు మధ్య ఉత్తరాలు నడుస్తుంటాయి. అయితే, నందియా విరహాన్ని భరించలేక తన దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి, నాలుగు జతల బట్టలతో సైకిల్ పై బయలుదేరుతాడు. దేశాలు దాటి వెళుతూ ఉంటాడు. మార్గం మధ్య లో తనకు ఆశ్రయం ఇచ్చిన వారికి తన గాధను వివరిస్తూ వెళ్తాడు. కొన్నిచోట్ల భాష రాక ఇబ్బందిపడతారు. చివరకు చార్లెట్ ను చేరుకుంటాడు.

చార్లెట్ మొదట ఆశ్చర్యపోతుంది. కానీ అతనిని చేరదీసి అతను తిరిగి మాములుగా అయిన తరువాత తన పేరెంట్స్ కు పరిచయం చేస్తుంది. చార్లెట్ పేరెంట్స్ వీరి వివాహానికి ఒప్పుకోరు. అతనికి డబ్బు లేదు, చదువులు లేవు అని బాధపడతారు. కానీ చార్లెట్ వారిని ఒప్పిస్తుంది. వీరి సంసారం సజావు గా సాగుతుంది. ఇద్దరు పిల్లలు పుడతారు. అప్పటికే నందియా స్వీడన్ లో మంచి చిత్ర కారుడిగా ఎదుగుతాడు. భారత ఖ్యాతి ని స్వీడన్ లోను విస్తరిస్తాడు.


End of Article

You may also like