ఛత్రపతి సినిమా ని అంత తేలికగా మరచిపోలేము. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు అయితే అలా గుర్తుండిపోతాయి ఎన్నేళ్ళైనా.. అలాంటిదే సూరీడు సన్నివేశం కూడా. ఈ సినిమాలో సూరీడు అనే ఓ పిల్లవాడి పాత్ర ఉంటుంది. రౌడీల వద్ద పని చేస్తూ ఉంటాడు. ఈ చిన్న కుర్రాడు పని మానేసి చదువుకోవాలనుకుంటాడు. అయితే, అందుకోసం అతని ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. చివరకు రౌడీల చేతిలో చనిపోతాడు.

bhavyanth vamsi

ఈ సినిమాలో సూరీడు తల్లి అంధురాలు. సూరీడు చనిపోయాడని తెలియక ఆమె సూరీడు.. సూరీడు.. అని పిలిచే సన్నివేశం కంటతడి పెట్టిస్తుంది. ఇక్కడ నుంచి కథ కూడా కీలక మలుపు తిరుగుతుంది. ఆ కుర్రాడు ఎవరో కాదు.. భవ్యంత్ వంశీ.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..? హీరో రేంజ్ లో కనిపిస్తున్నాడు. కోరమీసం తో , గడ్డం తో భవ్యంత్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఇటీవల భవ్యంత్, ఛత్రపతి లో తన తల్లి గా నటించిన అనిత చౌదరి తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.