మీరు కొట్టుకునే సెంటు వల్ల ఇంత నష్టం జరుగుతుందా? ఈ చిన్న టెస్ట్ చేసి ఏ సెంటుని వాడాలో తెలుసుకోండి..!

మీరు కొట్టుకునే సెంటు వల్ల ఇంత నష్టం జరుగుతుందా? ఈ చిన్న టెస్ట్ చేసి ఏ సెంటుని వాడాలో తెలుసుకోండి..!

by Megha Varna

Ads

మనం చక్కగా స్నానం చేసి, బట్టలు వేసుకుని, బాడీ స్ప్రే ని కొట్టుకుని టిప్ టాప్ గా తయారయ్యి వెళ్లిపోతుంటాము. బాడీ స్ప్రే ని ఉపయోగించడం వల్ల కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి.

Video Advertisement

 

వాటి కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా ఉపయోగించే వాటిలో బాడీ స్ప్రే కూడా ఒకటి. అయితే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బాడీ స్ప్రే వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఒక కొవ్వొత్తిని వెలిగించి మీరు బాడీ స్ప్రే తీసి దాని మీద స్ప్రే చేస్తే మంట పైకి రావడాన్ని మనం గమనించవచ్చు.

కెమికల్స్ ఉంటే అలా వస్తుంది. ఇలా చర్మానికి హాని చేసే వాటిని ఉపయోగించడం వల్ల చర్మం పై సమస్యలు వస్తాయి. మీరు వాడే బాడీ స్ప్రే వల్ల హాని కలుగుతుంది లేదా అనేది పిల్లలకు తెలిసేలా చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఒక కాగితం తీసుకుని దాని మీద పెన్ తో గీతలాగ పెట్టి దాని మీద బాడీ స్ప్రే కొట్టి వేలు తో టచ్ చేసి చూస్తే కెమికల్స్ ఉంటే కాగితం నుండి ఇన్క్ మొత్తం వచ్చేయడాన్ని మనం చూడొచ్చు.

ఒకవేళ కెమికల్స్ లేవు అంటే ఇన్క్ మనకి అంటుకోదు. బాడీ స్ప్రే లో ఉండే కెమికల్ కారణంగా స్కిన్ క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయి. అదేవిధంగా అండర్ ఆర్మ్స్ నల్లగా మారడానికి కారణం కూడా బాడీ స్ప్రే. చర్మ సంరక్షణ విషయంలో మనం తీసుకునే ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

చాలా మంది ఇటువంటివి తెలియక బాడీ స్ప్రే వంటివి వాడుతుంటారు. కాబట్టి బాడీ స్ప్రే ని వాడేటప్పుడు కెమికల్స్ లేకుండా ఉండే వాటిని ప్రయత్నం చేయండి. ఇలా కాగితం ఎక్స్పరిమెంట్ లేదా క్యాండిల్ ఎక్స్పరిమెంట్ ద్వారా మీరు మీ బాడీ స్ప్రే ని వాడొచ్చా లేదా అనేది తెలుసుకోవచ్చు.


End of Article

You may also like