“చెయ్యని నేరానికి బలి అవుతున్నా..” అంటూ వాట్సాప్ స్టేటస్..కన్నీళ్లు పెట్టిస్తున్న యువకుడి స్టోరీ..!

“చెయ్యని నేరానికి బలి అవుతున్నా..” అంటూ వాట్సాప్ స్టేటస్..కన్నీళ్లు పెట్టిస్తున్న యువకుడి స్టోరీ..!

by Anudeep

Ads

ఇటీవల ఆత్మహత్య ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. చిన్న చిన్న కారణాలకు సైతం నిండు ప్రాణాలను వదిలేసుకుంటున్నారు. తీవ్ర మనస్థాపానికి గురి కావడం, ఆపై ఆత్మహత్య కు పాల్పడడం ఎక్కువ గా జరుగుతోంది. ఇటీవల ఓ యువకుడు వాట్సాప్ స్టేటస్ పెట్టి ఆత్మహత్య కు పాల్పడడం సన్నిహితుల మనసుల్ని కలచివేస్తోంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం లోని భీంపల్లికి గ్రామానికి చెందిన చింతల ప్రసాద్‌ ‘చెయ్యని నేరానికి బలి అవుతున్నా..’ అంటూ వాట్సాప్ లో స్టేటస్ పెట్టి ఆత్మహత్య కు పాల్పడ్డాడు.

Video Advertisement

bhimpalli man

10 టీవీ కధనం ప్రకారం.., చింతల ప్రసాద్‌ భీంపల్లి గ్రామానికే చెందిన బొంకూరి కుమార్ అనే యువకుడిని, బాబాయ్ కొడుకు అయిన రమేష్ ను వ్యవసాయ పనుల నిమిత్తం తోడు తీసుకెళ్లాడు. గతం లో కూడా వ్యవసాయ పనుల కోసం వీరు కలిసి వెళ్లేవారు. డిసెంబర్ 30 వ తేదీన కూడా రమేష్, కుమార్ లను ప్రసాద్ తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. మరో యువకుడు పూర్ణ చందర్ తో పాటు అక్కడే కలిసి పార్టీ చేసుకుని.. రాత్రి పడుకుండిపోయారు. తెల్లరాక, కుమార్ , రమేష్ లు ప్రసాద్ తో కలిసి పొలం పనుల కోసం వెళ్లారు.

పూర్ణ చందర్ ను దించి రావడానికి ప్రసాద్ వెనక్కి వచ్చి దింపేసి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో బీరువా లో ఉండే ఏడున్నర తులాల బంగారం మాయమైంది. ఈ విషయాన్నీ కుమార్, రమేష్ లను ప్రసాద్ అడిగాడు. వారు తెలియదని చెప్పడం తో ప్రసాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కుమార్, రమేష్ లను విచారించి తిరిగి ఇంటికి పంపించేశారు. అయితే, పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి రావడం తో కుమార్ మనస్థాపానికి గురి అయ్యాడు. “చెయ్యని నేరానికి బలి అవుతున్నా.. ప్రాణం కంటే పరువు ముఖ్యం అని అర్ధం.. మిస్ యూ ఫ్రెండ్స్ ” అంటూ వాట్సాప్ లో స్టేటస్ పెట్టి ఆ తరువాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే గుర్తించి హనుమకొండ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 


End of Article

You may also like