“సంతోష్ శోభన్” లాగానే… “చైల్డ్ ఆర్టిస్ట్” నుండి “హీరో” లుగా మారిన 12 నటులు..!

“సంతోష్ శోభన్” లాగానే… “చైల్డ్ ఆర్టిస్ట్” నుండి “హీరో” లుగా మారిన 12 నటులు..!

by Anudeep

బాల నటులుగా ఇండస్ట్రీకి వచ్చి కొన్నేళ్ల పాటు సత్తా చూపించి.. ఆ తర్వాత ఉన్నట్లుండి మాయం అయిపోతుంటారు కొందరు పిల్లలు. చిన్నపుడు స్కూల్ వయసులోనే అక్కడా ఇక్కడా బ్యాలెన్స్ చేస్తూ సినిమాల్లో కనిపిస్తారు. ఆ తర్వాత చదువు పేరుతో కొన్నేళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా పోతారు. ఆ తర్వాత కుర్ర వయసుకు వచ్చాక మళ్లీ వచ్చి సినిమాలు చేస్తుంటారు. అలాంటి కొందరు ఒకప్పటి బాలనటులు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరోలయ్యారు. అందులో కొందరు సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

#1 కమల్ హాసన్

బాల నటుడిగా దాదాపు 6 చిత్రాల్లో నటించారు. ఆ తరువాత హీరో అయ్యాక 200 పైగా చిత్రాల్లో నటించారు.

child artists turned as heros..

#2 మహేష్ బాబు

మహేష్ బాబు తన తండ్రి కృష్ణ గారితో కలిసి అనేక సినిమాల్లో బాల నటుడిగా కనిపించారు. మహేష్ ప్రధాన పాత్రలో బాల చంద్రుడు అనే మూవీ కూడా వచ్చింది. తన నాలుగేళ్ల వయసులోనే దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’ అనే చిత్రం ద్వారా.. 1979లో బాల నటుడిగా పరిచయమవ్వగా.. మొత్తంగా 11 ఏళ్లలో 9 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు.

child artists turned as heros..

#3 జూనియర్ ఎన్టీఆర్

ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటుతున్న ఎన్టీఆర్ బాల రామాయణం చిత్రం లో నటించారు. అంతకుముందే బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుడి పాత్రలో కూడా జూనియర్ ఎన్టీఆర్ నటించారు.

child artists turned as heros..

#4 తరుణ్

చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ హిట్స్ అందుకున్న మరో హీరో తరుణ్. తర్వాత హీరోగా అడుగు పెట్టాక కూడా ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. అదేవిధంగా ఉత్తమ బాల నటుడిగా పలుమార్లు నంది అవార్డు కూడా అందుకున్నారు.

child artists turned as heros..
#5 బాలాదిత్య

లిటిల్ సోల్జర్స్ వంటి సూపర్ హిట్ చిత్రం తో పాటు .. ఆ యిమే లో చాలా చిత్రాల్లో బాల నటుడిగా కనిపించారు బాలాదిత్య. తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

child artists turned as heros..

#6 అఖిల్
ఇక అఖిల్ సిసింద్రీ సినిమా గురించి చెప్పుకోనవసరం లేదు. నడక రాని టైం లోనే యాక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు అఖిల్. తర్వాత అఖిల్ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.

child artists turned as heros..

#7 తనీష్

దేవుళ్ళు సినిమాలో అయ్యప్ప స్వామి గా మనకు గుర్తుండిపోయే పాత్రలో నటించాడు తనీష్. తర్వాత నచ్చావులే సినిమాతో హీరో అయ్యాడు.

child artists turned as heros..

#8 తేజ సజ్జ
ఇంద్ర సినిమాలో చిన్నప్పటి చిరంజీవిగా ఇరగదీశాడు తేజ. ప్రస్తుతం భిన్నమైన కథాంశాలు ఎంచుకుంటూ భవిష్యత్ సూపర్ స్టార్ అయ్యే దిశగా పయనిస్తున్నాడు.

child artists turned as heros..

#9 ఆకాష్ పూరి

పూరిజగన్నాథ్ కుమారుడైన ఆకాష్ బుజ్జిగాడు చిత్రం లో మొదటిసారి కనిపించాడు. తర్వాత ఆంధ్ర పోరి చిత్రం తో హీరోగా మారాడు.

child artists turned as heros..

#10 మనోజ్ నందం
ఛత్రపతి లో చిన్నప్పటి ప్రభాస్ పాత్ర చేసిన మనోజ్ ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ తో హీరోగా మారాడు.

child artists turned as heros..

#11 సంతోష్ శోభన్

గోల్కొండ హై స్కూల్ చిత్రం లో నటించిన సంతోష్..తనకు నేను చిత్రం తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.

child artists turned as heros..

#12 నాగ అన్వేష్

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రం లో వెంకటేష్ కొడుకుగా నటించాడు నాగ అన్వేష్. తర్వాత వినవయ్యా రామయ్య చిత్రం తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

child artists turned as heros..


You may also like