పిల్లలకు ఆన్లైన్ క్లాసులు…తల్లితండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.! తప్పక తెలుసుకోండి.!

పిల్లలకు ఆన్లైన్ క్లాసులు…తల్లితండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.! తప్పక తెలుసుకోండి.!

by Mohana Priya

Ads

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా, విద్యాసంస్థలు తెరవలేరు కాబట్టి, స్టూడెంట్స్ కి వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ క్లాస్ అంటే కచ్చితంగా ఫోన్, లేదా ల్యాప్ టాప్ ఉపయోగించాల్సిందే. సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులకి తమ పిల్లలు ఫోన్ లేదా ఇతర గాడ్జెట్స్ కి అలవాటు పడిపోతారు ఏమో అనే భయం ఉంటుంది. నిజంగానే చాలా మంది పిల్లలు కూడా వయసు పరిమితి లేకుండా, అంటే స్కూల్ స్టూడెంట్స్ కూడా ఎక్కువగా ఫోన్ వాడుతున్నారు.

Video Advertisement

ఇలాంటి సమయంలో ఇంకా ఫోన్ లోనే క్లాసెస్ అంటే, ఒకవేళ పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతే ఏం చేస్తారో అనే ఆందోళన చాలా మంది తల్లిదండ్రులకి ఉంటుంది. కాబట్టి తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలి అని అంటున్నారు నిపుణులు.

గమనించడం అంటే ఇప్పుడు ఒక క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్ళ టీచర్ ఏం చెప్పారో చెప్పమని అడగడం, అలాగే ఆ రోజు పాఠాలని చదివించి తిరిగి వాళ్ల చేత చెప్పించడం. ఇంకా పదవ తరగతి లోపు పిల్లలు అయితే, వాళ్లకి ఫోన్ పరిమితికి మించి ఎక్కువ ఇవ్వద్దు అని, అంతే కాకుండా వీలుంటే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు వారి పక్కనే కూర్చోవాలి అని అంటున్నారు.

అంతేకాకుండా వీలున్నప్పుడు పిల్లలతో కొంత సమయం గడపడం కూడా మంచిది అని అంటున్నారు. వాళ్లతో కలిసి బయటికి వెళ్లడం, ఎక్సర్సైజ్ చేయడం, ఫ్రెండ్లీ గా ఉండడం చేస్తే తల్లిదండ్రులకి కూడా తమ పిల్లల ప్రవర్తన పై పూర్తి అవగాహన రావడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుందట. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ విషయంలో, లేదా పిల్లల చేతిలో ఫోన్ ఉండే విషయంలో ఆందోళన కూడా తగ్గుతుందట.

పిల్లలని పెంచడం అనేది తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తారు అని. ఆ బాధ్యత ఇష్టంతో కాకుండా, భయాందోళనలతో చేస్తే తల్లిదండ్రుల కి ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో పాటు , ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయట. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలని పెంచడం అనే నిర్ణయం తమ ఇష్టంతోనే తీసుకుంటారు కాబట్టి, అదే ఇష్టం తో ఆ బాధ్యతను కూడా స్వీకరిస్తే ఇలాంటి ఒత్తిడి, ఆందోళన అనేవి రావు అని, నిపుణులు చెప్తున్నారు.

 


End of Article

You may also like