“ఇలాంటి చాలా మందిని ఈ దేశం చూసింది..!” అంటూ… “ఉదయనిధి స్టాలిన్” పై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడి కామెంట్స్..! ఏం అన్నారంటే..?

“ఇలాంటి చాలా మందిని ఈ దేశం చూసింది..!” అంటూ… “ఉదయనిధి స్టాలిన్” పై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడి కామెంట్స్..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడు, మినిస్టర్ మరియు ప్రముఖ హీరో అయిన ఉదయనిధి స్టాలిన్‌ ఇటీవల  సనాతన ధర్మం పై కామెంట్స్ చేశారు. అతను చేసిన వ్యాఖ్యల పై  దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అటు రాజకీయలలో తీవ్ర చర్చకు దారి తీసాయి. యూనియన్ హోం మినస్టర్ అమిత్‌ షాతో పాటు పలువురు రాజకీయనేతలు ఉదయనిధి కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు.

Video Advertisement

ఈ విషయాన్ని బిజెపి జాతీయ అంశంగా మార్చింది. ఉదయనిధి కామెంట్స్ ను తమకు అనుకూలంగా మార్చుకుని, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమిని అడ్డుకునే దిశగా ప్రయత్నం చేస్తోంది. తాజాగా చిల్కూరు  బాలాజీ గుడి ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఉదయనిధి స్టాలిన్‌మాట్లాడుతూ సనాతన ధర్మం బడుగు, బలహీన వర్గాలు మరియు దళితులను అణగదొక్కి, బ్రాహ్మణిజాన్ని పోషిస్తోందని అన్నారు. సనాతన ధర్మం పేరుతో కొందరు దళితులకు ఆలయ ప్రవేశాన్ని  అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పేర్కొన్నారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసాయి. రాజకీయంగా పలువురు నేతలు ఉదయనిధి చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నారు.
తాజాగా ఉదయనిధి వాఖ్యల పై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి రంగరాజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ఎవ్వరు కూడా నిర్మూలించలేరని అన్నారు. ఉదయనిధి లాంటివారిని ఇప్పటికే చాలామందిని ఈ దేశం చూసిందని అని అన్నారు. మన దేశం మీద ఎంతోమంది దండయాత్రలు చేశారని, కానీ వారంతా కూడా కాలగర్భంలో కలిశారని చెప్పారు. హిందూ దేవలయాలపై ఎన్నో దాడులు చేశారని, అయినా హిందూ ధర్మం నిలిచే ఉందని అన్నారు.
సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిపై ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉందని, ముందు ఉదయనిధి స్టాలిన్‌ ద్రవిడ భావజాలం అంటే అర్ధం తెలుసుకోవాలని రంగరాజన్‌ చెప్పారు. సనాతన ధర్మం నిర్మూలించాలని చెపుతున్న ఉదయనిధి స్టాలిన్ తమిళ సంస్కృతి కోసం, అభివృద్ధి, పరిరక్షించడం కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలు సనాతన ధర్మాన్ని గౌరవించే వారినే ప్రతినిధులుగా ఎన్నుకోవాలని రంగరాజన్‌ కోరారు.

watch video : 

Also Read: “అంత ముఖ్యమైన విషయాన్ని మార్చాల్సిన అవసరం ఏంటి..?” అంటూ… “నారప్ప” పై కామెంట్స్..!

 


End of Article

You may also like