కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన ‘అసురన్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. విజయం పూమణి రచించిన బెస్ట్ సెల్లింగ్ నవల ‘వెక్కై’ ఆధారంగా అసూరన్ మూవీ తెరకెక్కింది.

Video Advertisement

ఈ చిత్రానికి రీమేక్ గా తెలుగులో నారప్ప సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా, శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఒకే నటి రెండు భాషలలో ఒకే పాత్రలో నటించింది.  కానీ ఆమె పాత్రలో మార్పులు ఉండడంతో నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ధనుష్, మంజు వారియర్‌ నటించిన సినిమా అసూరన్. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలలో ధనుష్ కు అక్క కూతురు మరియమ్మ పాత్రలో అమ్ము అభిరామి నటించింది. ధనుష్ శివసామిగా నటించాడు. శివసామి, మారియమ్మలు ప్రేమించుకుంటారు. ఆమె కుటుంబంతో సహా గుడిసెలలో సజీవదహనం అవుతుంది.
అయితే డైరెక్టర్ వెట్రిమారన్ మరియమ్మ పాత్రను చదువుకోవడానికి స్కూల్ కు వెళ్ళే పాత్రలో చూపించారు. ఈ మూవీ చదువు నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రం 2019లో అక్టోబర్ లో రిలీజ్ అయ్యి, ఘన విజయం సాధించింది. ఈ మూవీ ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డ్ తో పాటు పలు అవార్డులను గెలుచుకుంది. ధనుష్ ఉత్తమ నటుడి అవార్డును అసురన్ చిత్రానికి గాను పొందారు. ఇదే సినిమాని తెలుగులో నారప్ప టైటిల్ తో తెరకెక్కించారు. ఈ మూవీలో అగ్ర హీరో వెంకటేష్, ప్రియమణి జంటగా  నటించారు. ఒరిజినల్ మూవీలో మరియమ్మ పాత్రను చేసిన అమ్ము అభిరామి నారప్ప ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరో అక్క కూతురి పాత్రలో కన్నమ్మగా నటించింది. అయితే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కన్నమ్మ పాత్రను టైలరింగ్ నేర్చుకున్నట్టుగా చూపించారు. ఈ విషయాన్ని గమనించిన నెటిజెన్లు అసలు సినిమానే విద్య గురించి, కాబట్టి తమిళంలో చదువుకున్నట్టుగా చూపించారు. కానీ తెలుగులో ఆ పాయింట్ ఎందుకు మార్చారు అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: “అతడు” తర్వాత “మురళీ మోహన్” సినిమాలు ఆపేయడానికి కారణం ఇదేనా..? అసలు విషయం ఏంటంటే..?