ప్రశాంత్ వర్మ ప్లాన్ సూపర్… వర్కౌట్ అయితే రికార్డులు బ్రేక్.!

ప్రశాంత్ వర్మ ప్లాన్ సూపర్… వర్కౌట్ అయితే రికార్డులు బ్రేక్.!

by Mounika Singaluri

మొన్న సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా ఎంతటి సంచలనం విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 250 కోట్లు కలెక్షన్లు దాటి సాధించింది. విడుదలై రెండు వారాలు దాటుతున్న ధియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ సినిమా ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందో అంటూ ఎదురుచూస్తున్నారు.

Video Advertisement

అయితే ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమాలో రాముడిగా, హనుమంతుడిగా ఎవరు కనిపిస్తారు దానికి ప్రశాంత్ వర్మ ఒక ఆన్సర్ ఇచ్చారు. అన్ని కుదిరితే హనుమంతుడిగా చిరంజీవి రాముడిగా మహేష్ బాబు ఉండాలని అనుకుంటునట్లు డైరెక్టర్ చెప్పారు. ఇప్పటికే హనుమాన్ సినిమాలో హనుమంతుని కళ్ళు చిరంజీవిని పోలివున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమా విడుదలైన తర్వాత మెగాస్టార్ ని ఇంకా కలవలేదని ఒకవేళ కలిస్తే ఆ ప్రపోజల్ ఆయనకు చెబుతామని అన్నాడు. ఇక రాముడిగా మహేష్ బాబు ఫోటోలు డిజైన్ చేసుకుని తమ ఆఫీసులో పెట్టుకున్నామని కూడా తెలిపారు. ఒకవేళ ప్రశాంత్ వర్మ అనుకుంటున్నట్లు మహేష్ చిరంజీవి ఈ పాత్రలు చేయడానికి ఒప్పుకుంటే బాహుబలి రికార్డులను కూడా ఈ సినిమా తిరగ రాస్తుంది.

Also read: ప్రశాంత్ వర్మ హనుమాన్ ఫేస్ ని చూపించకపోవడానికి కారణం ఇదేనా..?


You may also like

Leave a Comment