చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Video Advertisement

ఇప్పటికే విడుదలైన టీజర్ అలాగే సల్మాన్ ఖాన్ తో మెగాస్టార్ చేసిన సాంగ్ కూడా బాగా వైరల్ అయింది. తప్పకుండా ఈ సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని కూడా అంచనాలు ఏర్పడుతున్నాయి.

god father censor talk
ఇక మొత్తంగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయినట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. గాడ్ ఫాదర్ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లుగా ప్రత్యేకంగా ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇక పోస్టర్లో మెగాస్టార్ చిరంజీవి మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్ గా కనిపిస్తున్నాడు. బ్లూ షర్ట్ తో పాటు పంచె కట్టులో కూడా మెగాస్టార్ కనిపించిన విధానం, ఒక చెస్ బోర్డులో ఆయన నడుస్తున్న విధానాన్ని బట్టి చూస్తూ ఉంటే సినిమాలో రాజకీయ ఎత్తులతో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉన్నట్లుగా అనిపిస్తోంది.

god father censor talk
ఇక ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించినట్లుగా కూడా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. సెన్సార్ సభ్యులు సైతం చిరంజీవి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని చెబుతున్నారు. సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ పాత్రలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయని సమాచారం. చిరంజీవి, సల్మాన్ కాంబో సీన్లు బాగున్నాయని బోగట్టా.

god father censor talk
తెలుగు, హిందీ భాషల్లో అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అయిందని తెలుస్తోంది. గాడ్ ఫాదర్ దసరా సమయంలో సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ గా నిలవనుంది.

god father censor talk
తాజాగా ఈ సినిమా సెన్సార్‌కు సంబంధించిన రిపోర్ట్‌ను దర్శకుడు మోహన్‌ రాజా అభిమానులతో షేర్‌ చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ విషయమై దర్శకుడు ట్వీట్ చేస్తూ.. ‘ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా సెన్సార్‌ సభ్యుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది’ అని రాసుకొచ్చారు. మరి దసరా బరిలో దిగుతోన్న మెగాస్టార్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తారో తెలయాలంటే అక్టోబర్‌ 5 వరకు వేచి చూడాల్సిందే.

god father censor talk
ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తోంది. భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ఓటీటీ హక్కులతో అందరి దృష్టిని ఆకర్షించింది. గాడ్‌ ఫాదర్‌ ఓటీటీ హక్కులకు ఏకంగా రూ. 57 కోట్లుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ తెలుగు, హిందీ హక్కుల కోసం ఈ మొత్తాన్ని చెల్లిస్తుందని సమాచారం.