Godfather Telugu OTT:  చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయ్యింది. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు.

Video Advertisement

దాని తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కూడా ప్రేక్షకులని నిరాశపరిచింది. దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. కానీ తెలుగులో చాలా మార్పులు చేశారు.

Godfather Telugu OTT Release Date and OTT Platform

Godfather Telugu OTT

Godfather Telugu OTT

మెగాస్టార్ అభిమానులు నిరాశ పడకుండా ఉండేలా గా సినిమాలో చాలా యాక్షన్ సీన్స్ ఉండేలా చూసుకున్నారు. కానీ సినిమా ఫలితం మాత్రం ఆశించిన విధంగా రాలేదనే చెప్పాలి. బాగుంది అని అన్నారు కానీ చిరంజీవి సినిమా ఇది అయితే కాదు అని అన్నారు. అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా గురించి మరొక వార్త బయటకు వచ్చింది. అదేంటంటే నవంబర్ లో ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతోంది. ఈ సినిమా నవంబర్ 15వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది అని వార్తలు వస్తున్నాయి.

minus points in god father..!!

ఈ సినిమా తెలుగుతోపాటు హిందీలో కూడా విడుదల అయ్యింది. హిందీలో కూడా ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఇందులో సల్మాన్ ఖాన్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు అనే సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేశారు. సల్మాన్ ఖాన్ ఒక పాటలో కూడా కనిపిస్తారు. అలాగే కొన్ని తెలుగు డైలాగ్స్ కూడా సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం మాట్లాడారు. ఇంక చిరంజీవి విషయానికి వస్తే ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇంకా కొన్ని రోజుల్లో విడుదల అవుతుంది.