సాధారణంగా ప్రతి వారం ఏదో ఒక చిత్రం విడుదల అవుతూనే ఉంటుంది. ఇలా వచ్చిన చిత్రాలలో ఈ మధ్య కొన్ని చిత్రాలు హిట్ అవడం, ఎక్కువ చిత్రాలు ప్లాప్ అవడం జరుగుతోంది. ఏడాదిలో వందల కొద్దీ చిత్రాలు విడుదల అవుతుంటే వేళ్ల పై లెక్కపెట్టే అన్ని చిత్రాలు మాత్రమే విజయాన్ని సాధిస్తున్నాయి.

Video Advertisement

అయితే దీనికి కారణం ఏమిటి? ఎవరు? అనేది చెప్పడం కష్టమైన విషయమే. రీసెంట్ గా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ‘ఏజెంట్’ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో గతంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్  వైరల్ అవుతున్నాయి.
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏజెంట్’ మూవీ నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయితే రిలీజ్ అయిన 4 రోజులకే ఈ చిత్ర నిర్మాత మూవీ ఫెయిల్యూర్ ను ఒప్పుకుంటు, తమ దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే మూవీ మొదలు పెట్టామని చెప్పారు. ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గతంలో దర్శకులకు చేసిన సూచనలు ఇప్పుడు వైరల్ గా మారాయి. చిరంజీవి ఆరోజు  చెప్పిందే ఏజెంట్ మూవీ విషయంలో జరిగిందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇండస్ట్రీలో కూడా ఇదే టాక్ వినిపిస్తోందని సమాచారం. కానీ చిరంజీవి అప్పుడు అలా చెప్పినపుడు ఆయన పై విమర్శలు, ట్రోల్స్ విపరీతంగా చేశారు. ఇప్పుడు ఆయన చెప్పిందే నిజం అని అంటున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ యంగ్ దర్శకులకు పలు సూచనలు చేశారు. మూవీ షూటింగ్‌ మొదలు పెట్టడానికి ముందే దర్శకులు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. చిత్రీకరణ మధ్యలో సందర్భానుసారంగా సన్నివేశంలో మార్పులు చేస్తే పర్లేదు.
అయితే అప్పటికప్పుడే సన్నివేశాన్ని రాసుకునే పద్ధతిని పద్దతిని,అప్పుడు కథ రాసుకునే విధానాన్ని మానుకోవాలని  సూచించారు. సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్‌ ను దాటి ఒక్క సన్నివేశాన్ని కూడా రూపొందించకుండా ముందుగానే పేపర్ వర్క్ చేసుకోవాలని సూచించారు. ఆ విధనగా నిర్మాతకి డబ్బు ఆదా అయ్యేలా చేయాలని, నిర్మాతలను బతికించాలని, నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీలో మరిన్ని చిత్రాలు వస్తాయని, అప్పుడే సినీ పరిశ్రమ బాగుంటుదని మెగాస్టార్ యువ దర్శకులకు గట్టిగానే చెప్పారు. మరి ఇక నుండి అయిన డైరెక్టర్స్ మెగాస్టార్ సూచనలు పాటిస్తారేమో చూడాలి.

Also Read: 2017 లో “అఖిల్” కి… “అక్కినేని అభిమానులు” రాసిన ఈ లెటర్‌ చూసారా..?