టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత ఇప్పటికే “ఖైదీ నంబర్ 150” , “సైరా నరసింహారెడ్డి” సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసారు. కేవలం కాస్ట్యూమ్ డిజైనర్ గానే కాకుండా.. ఓ వెబ్ సిరీస్ కు నిర్మాత గా కూడా ఆమె పని చేసారు. ఆమె తన భర్త తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే సంస్థ ను నిర్మించారు. ఈ సంస్థ లోనే “షూట్ ఎట్ ఆలేరు” అనే వెబ్ సిరీస్ ను కూడా నిర్మించారు.

chiru daughter 1

ఇటీవల ఓటిటి ప్లాట్ ఫామ్ జీ 5 లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం అయ్యి మంచి పేరే తెచ్చుకుంది. తాజాగా ఆమె సినిమాల్లోకి కూడా రాబోతోంది. తన నిర్మాణ సంస్థ లో నే ఆమె ఓ తెలుగు సినిమాను నిర్మిస్తోంది. ఆ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదల అయింది.

chiru daughter 2

ఈ సినిమా పేరే “శ్రీదేవి శోభన్ బాబు” . అలనాటి తరం లో శ్రీదేవి, శోభన్ బాబులకు మంచి హిట్ పెయిర్ అన్న టాక్ ఉంది. వీరిద్దరూ కలిసి చేసిన చాలా సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. ఇల్లాలు, మోసగాడు, కార్తీక దీపం, దేవత, కక్ష, వంటి అనేక సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారు. తాజాగా వారిద్దరి పేర్లతో సినిమా టైటిల్ ను ప్రకటించి సుస్మిత హైప్ క్రియేట్ చేసారు. ఈ సినిమా ఎంత వరకు విజయం సాధిస్తుందో చూడాలి.