వయస్సు పెరుగుతున్నాకొద్ది జోష్ కూడా పెరుగుతుంది మెగాస్టార్ చిరంజీవిలో. ముఖ్యంగా రీ ఎంట్రీ త‌ర్వాత మెగాస్టార్‌ ఫుల్ జోరు చూపిస్తున్నారు. ఒకప్పుడు కెరీర్ స్టార్టింగ్ లో స్టార్ గా మారినప్పుడు ఆయనలో ఎంత జోష్ ఉండేదో.. ఇప్పుడుఅది మళ్లీ కనిపిస్తుంది. జోష్‌తో సినిమాలు చేస్తున్నాడు. అప్పట్లో ఆయనకు ఎంతటి బిజీ షెడ్యూల్‌ ఉండేదో.. ఇప్పుడు కూడా అంతే బిజీతో వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మెగాస్టార్ గాడ్‌ఫాద‌ర్‌ గా మారి పవర్ ఫుల్ పొలిటికల్‌ యాక్షన్ కథతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఈసినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Video Advertisement

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ తో పాటు టీజ‌ర్.. ట్రైలర్ వరకూ అన్నింటికి మెగా రెస్పాన్స్ వచ్చింది. గాడ్ ఫాదర్ పై ఆడియన్స్ లో భారీగా అంచనాలు పెరిగాయి. ఈ ప్రమోషన్ వీడియెస్ వాటిని ఇంకా పెంచాయి. మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబ‌ర్ 5న రిలీజ్ కాబోతోంది. ఇక దగ్గర పడుతుండటంతో చిరు ప్రమోషన్‌లను జోరు పెంచారు.

chiru comments about god father sequel..

ఇక ప్రమోషన్‌లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మెగాస్టార్. ఇందులో సినిమాకు సంబంధించిన చాలా విషయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో జరిగిన ఓ ప్రెస్‌ మీట్‌లో గాడ్‌ ఫాదర్ సీక్వెల్‌ గురించి మాట్లాడారు చిరంజీవి. గాడ్‌ఫాదర్‌ సీక్వెల్‌ను తెరకెక్కించడానికి అవకాశాలున్నాయిని సీక్రెట్ రివిల్ చేశారు మెగాస్టార్. కానీ, ఖచ్చితంగా సీక్వెల్‌ను రూపొందిస్తామని చెప్పలేదు. ఇక గాడ్‌ఫాదర్ రిజల్ట్‌ను బట్టి సీక్వెల్‌కు ప్లాన్‌ వేస్తారెమో చూడాలి.

chiru comments about god father sequel..

గాడ్ ఫాదర్ మూవీని మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన లూసీఫ‌ర్‌ కు రీమేక్‌గా తెరకెక్కించారు. మలయాళంలో మోహన్ లాల్ పోషించిన పాత్రను తెలుగులో మెగాస్టార్ చేశారు. ఇక కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, సూప‌ర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ అతిధి పాత్ర‌లో న‌టించ‌గా స‌త్య‌దేవ్ విలన్ గా చేశారు. ఇక న‌య‌న‌తార ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ కు ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతాన్ని అందించాడు.