మెగా స్టార్ చిరంజీవి తాజాగా చేసిన ఒక పోస్ట్ సంచలనం గా మారింది. తన రాబోయే చిత్రం ‘గాడ్ ఫాదర్’ లోని ఒక ఆడియో క్లిప్ ను సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఇటు ఇండస్ట్రీ తో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Video Advertisement
మంగళవారం చిరు చేసిన ట్వీట్ లో “నేను రాజకీయం నుంచి దూరం గా ఉన్నాను.. కానీ రాజకీయం నాకు దూరం కాలేదు” అని వాయిస్ ఓవర్ తో ఉన్న ఆడియో ని షేర్ చేసారు. దీంతో చిరు పొలిటికల్ రీ ఎంట్రీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. చిరు ఈ పోస్ట్ చెయ్యడం వెనుక ఆంతర్యం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు.
వైరల్ గా మారిన ఈ ట్వీట్ గురించి మెగా అభిమానులు ఆసక్తి గా చర్చించుకుంటున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం మనకు రాజకీయాలు వద్దు బాస్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు.చిరంజీవి ట్వీట్ ను కొందరు సినిమా ప్రమోషన్ యాంగిల్ లో చూస్తున్నారు, మరికొందరు పొలిటికల్ యాంగిల్ లో చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు విషయం ఏమిటనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇది ఇలా ఉంటే.. సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించడంలో చిరంజీవి ముందున్నారు. సినీ పరిశ్రమ సమస్యల గురించి ఏకంగా సీఎం జగన్ దగ్గరకు కూడా వెళ్లి చర్చలు జరిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలో చిరంజీవిని రాజ్యసభకు పంపుతారని అప్పట్లో జోరుగా ప్రచారం నడిచింది.
రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అయిన అంశంపై జనసేన నేతలు స్పందించారు. చిరంజీవి వ్యాఖ్యలను పొలిటికల్ గా చూస్తున్నారా? లేక సినిమా ప్రమోషన్ లో భాగంగా చూస్తున్నారా? అంటే.. రెండు విధాలుగా చూడొచ్చని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఎందుకంటే సినిమాలు, పాలిటిక్స్ విడదీయరానివే అన్నారు. మా తమ్ముడు వెనకాల మా కుటుంబం అంతా ఉంటుందని చిరంజీవి గతం లో కూడా చెప్పారు. చెప్పినా చెప్పకపోయినా మెగాస్టార్ పూర్తి సహకారం పవన్ కు ఉంటుంది” అని బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు.