మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాడు. ఖైదీ నెంబర్ 150 , సైరా నరసింహ రెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు చిరు. అయితే చిరు చివరి రెండు చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో అభిమానులు ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం పై ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గినట్టుగానే ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు.

Video Advertisement

 

 

అయితే వాల్తేరు వీరయ్య తర్వాత చిరు మెహెర్ రమేష్ తో చేస్తున్న ‘బోళాశంకర్’ షూటింగ్ లో పాల్గొననున్నారు. తమిళం లో అజిత్ హీరోగా నటించిన వేదాళం చిత్రానికి భోళా శంకర్ రీమేక్. ఈ చిత్రం లో చిరుకి జోడీగా తమన్నా నటిస్తుండగా.. చిరు చెల్లెలి పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటించనుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే చిరు తదుపరి చిత్రం పై ఆసక్తికర అప్డేట్ ఒకటి చక్కర్లు కొడుతోంది.

chiru's next film with vv vinayak..??

అయితే నిన్నమొన్నటి వరకు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ మాస్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడికి చిరంజీవి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయనే వి వి వినాయక్. వినాయక్ ఇప్పటికే చిరంజీవితో రెండు హిట్ చిత్రాలను తెరకెక్కించారు. వినాయక్‌తో మరో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వినాయక్ కి ప్రస్తుతం టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఏమి చేతిలో లేవు. దీంతో ప్రస్తుతం రేసులో వెనుక బడ్డాడు.

chiru's next film with vv vinayak..??

అయితే రీసెంట్‌గా రామ్ చరణ్ మమ్ముట్టి నటించిన ‘భీష్మ పర్వం’ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని వినాయక్ చేతిలో పెట్టడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. గతంలో వినాయక్ చిరుతో తెరకెక్కించిన రెండు చిత్రాలు రీమేక్స్ కావడంతో ఈ చిత్రాన్ని కూడా వినాయక్ చేస్తే బావుందని భావించారట. అయితే వినాయక్ మాత్రం ఈ సారి డైరెక్ట్ స్టోరీ తోనే చిరు ని చూపించాలని భావిస్తున్నారట. మరి ఏ కథతో వినాయక్, చిరు ప్రేక్షకుల ముందుకి వస్తారో చూడాలి.