గోపీచంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన సీటిమార్ సినిమా ఇటీవలే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గోపీచంద్ ఈ సినిమా తో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ గా తమన్నా నటించినప్పటికీ.. మరో హీరోయిన్ కూడా ఉన్నారు.

suryavansi 1

ఆమె ఎవరో కాదు.. దిగంగ‌న సూర్యవంశీ. ఈ సినిమాలో ఆమె టివి జర్నలిస్ట్ గా కనిపించి అలరించారు. ఫ్రెష్ గా కనిపించిన ఆమె తన అందం తో ఆకట్టుకున్నారు. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఈ అమ్మాయి ని ఎక్కడో చూసినట్లుందే అనుకున్నారు. సూర్య వంశి సోప్ ఒపెరా ఏక్ వీర్ కీ అర్దాస్ అనే సీరియల్ లో నటించారు. ఇది తెలుగు లో వీర గా కూడా వచ్చింది. స్టార్ ప్లస్ లో ప్రసారం అయిన ఈ సీరియల్ అప్పట్లో మంచి టాక్ నే తెచ్చుకుంది.

suryavansi 3

సూర్యవంశీ తాను ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. శకుంతల (2009), కృష్ణ అర్జున్ మరియు రుక్ జానా నహిన్ (2011-12) వంటి ప్రోగ్రామ్స్ లో సపోర్టింగ్ రోల్స్ ను కూడా చేసారు. వీర సీరియల్ తరువాత ఆమె కు గ్యాప్ వచ్చింది. ఆ తరువాత 2015 లో బిగ్ బాస్ షో లో కూడా పాల్గొన్నారు. అప్పటికి ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు. అతి చిన్న వయసులో బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేసిన సెలెబ్రిటీ గా కూడా ఆమె గుర్తింపు పొందారు.

suryavansi 2

ఫ్రైడే మరియు జలేబి అనే రెండు సినిమాలతో ఆమె బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో కృష్ణన్ కెటి దర్శకత్వం వహించిన హిప్పీ చిత్రంలో సూర్యవంశీ ప్రధాన పాత్ర పోషించారు. ఇది కాకుండా వలయం అనే తెలుగు సినిమాలో కూడా ఆమె నటించారు. ప్రస్తుతం స్పోర్ట్స్ యాక్షన్ మూవీ గా రూపొందిన సీటిమార్ చిత్రం తో ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు.