ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అందులో  డ్యాన్స్, పాటలు పడుతున్న, వంటలు, జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు రకరకాల వీడియోలు ఉంటున్నాయి.

Video Advertisement

కొన్ని వీడియోలు వైరల్ అవడంతో అందులోని వారు రాత్రికి రాత్రే విపరీతమైన క్రేజ్, పాపులారిటీని  సొంతం చేసుకుంటున్నారు. ఆ మధ్య రైల్వే స్టేషన్‌లో పాట పాడి ఒకరు బాలీవుడ్ సింగర్ గా మారారు. తాజాగా ఒక అమ్మాయి నృత్యం చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుత కాలంలో ఎవరు, ఎప్పుడు సెలెబ్రెటీగా మారుతారో చెప్పలేము. సోషల్ మీడియా ప్రస్తుతం పాపులర్ అవ్వడానికి ఒక మార్గంగా మారిందని చెప్పవచ్చు. ఫేమస్ అవడానికి చిన్న,పెద్ద అనే తేడా లేకుండా రకరకాల వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎవరికి కున్న ప్రతిభను వారు వీడియోల ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నారు. కొందరు ఫ్రెండ్స్ తో కలిసి ఫన్నీ వీడియోలు, కొందరు, వంటల వీడియోలు, పాటలు పాడినావి, డ్యాన్స్ వీడివలు పెడుతున్నారు. కొందరు వారి వీడియోలను ట్రోల్ చేయడం వల్ల కూడా ఫేమస్ అవుతున్నారు. మరికొందరు వేరే వారు పాడుతుండగా వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. అలా షేర్ చేయడంతో చాలామంది పాపులర్ అవుతున్నారు. రైల్వే స్టేషన్‌లో పాట పాడే రాను మోండల్ పాటలు పాడుతూ జీవిస్తున్న ఆమె వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారడంతో ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యి, సెలబ్రిటీగా మారింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియాతో కలిసి పని చేసే అవకాశం పొందింది.
తాజాగా ఒక క్లాసికల్ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో నృత్యం చేసిన డ్యాన్సర్ అభినయానికి, డ్యాన్స్ కి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. లెజెండ్స్_స్టూడియో అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో క్లాసికల్ డ్యాన్సర్ శ్రియా హనుమంతు హవభావాలు, నృత్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె నిష్రింకలా డ్యాన్స్ అకాడమీలో క్లాసికల్ డ్యాన్స్ లో శిక్షణ పొందింది. శ్రియా హనుమంతు ఈ ఏడాది ఏప్రిల్ 30న తొలిసారి అధికారిక సోలో ప్రదర్శనను ఇచ్చారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె నాట్యాన్ని అభినందిస్తూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: మహాలక్ష్మి భర్త “రవీందర్” ని ఎందుకు అరెస్ట్ చేశారు..? అసలు ఏం జరిగిందంటే..?