కోలీవుడ్‌ నిర్మాత, మరియు నటి మహాలక్ష్మి భర్త అయిన రవీందర్‌ చంద్రశేఖరన్‌ గురించిన విషయాలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. గత సంవత్సరం బుల్లితెర నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. వీరి పెళ్లి ఫోటోలు కూడా అప్పట్లో నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Video Advertisement

వీరి పెళ్లి జరిగినప్పటి నుండి రవీందర్‌ను కొందరు నెటిజన్లు బాడీ షేమింగ్‌ చేస్తూ సామాజిక మధ్యమాలలో పోస్టులు కూడా చేశారు. అయితే తాజాగా మరోసారి రవీందర్‌ చంద్రశేఖరన్‌ వార్తల్లో నిలిచారు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ న్యూస్ కోలీవుడ్ లో సంచలనంగా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మహాలక్ష్మి, రవీందర్‌ చంద్రశేఖరన్‌ను పెళ్లి చేసుకోవడంతో ఆమె అతని డబ్బు కోసమే అని విమర్శించారు. ఆ తరువాత వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. అయితే మహాలక్ష్మీ దంపతులు సోషల్‌ మీడియా ద్వారా తమ అందమైన ఫొటోలను షేర్‌ చేస్తూ, విడాకుల రూమర్లకు చెక్‌ పెట్టారు. ఆ మధ్యన మహాలక్ష్మి రవీందర్‌ బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్‌ చేసింది.
ఇది ఇలా ఉంటే తాజాగా రవీందర్‌ చిక్కుల్లో పడ్డాడు. ఒక వ్యాపారవేత్తను మోసం చేశారని, సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ నిర్మాత రవీందర్‌ను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ వార్త సంచలనంగా మారింది. సాలిడ్ వెస్ట్ నుంచి కరెంట్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ పెట్టడం ద్వారా చాలా లాభాలు వస్తాయని రవీందర్‌ చెన్నై వ్యాపారవేత్త అయిన బాలాజీని  నమ్మించాడట. సదరు ప్లాంట్ కోసం డూప్లికేట్ పేపర్స్ ను క్రియేట్ చేసి, బాలాజీని నమ్మించి అందులో పార్ట్‌నర్‌ గా చేశాడు. దానికి గాను బాలాజీ నుండి దాదాపు పదహారు కోట్లు తీసుకున్నారని, రవీందర్‌ పై ఆరోపణలు వచ్చాయి.
ఈ ఒప్పందం తర్వాత రవీందర్‌  చెప్పినట్లుగా ఏ పని జరగలేదని, బాలాజీ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినా, ఎలాంటి స్పందన రవీందర్ నుండి రాలేదట. దాంతో బాలాజీ రవీందర్‌ పై చర్యలు తీసుకోవాలని చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ లో కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో పోలీసులు నిర్మాత రవీందర్‌ చంద్రశేఖరన్‌ అరెస్ట్‌ చేశారు.

Also Read: “ఉపాసన కొణిదెల” తాతయ్యకి జైలర్ నిర్మాత చెక్ ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా..?