సాఫ్ట్ వేర్ జాబ్ ని వదిలేసి టైలరింగ్ మొదలుపెట్టింది.. తర్వాత ఆమె జీవితం ఎలా మారిపోయిందంటే..?

సాఫ్ట్ వేర్ జాబ్ ని వదిలేసి టైలరింగ్ మొదలుపెట్టింది.. తర్వాత ఆమె జీవితం ఎలా మారిపోయిందంటే..?

by Anudeep

Ads

మనం అనుకున్నామని అన్నీ జరగవు. అనుకోలేదు అని ఆగిపోవు కొన్ని.. అంటూ ఆత్రేయ ఎప్పుడో చెప్పారు. మన జీవితంలో ఇలాంటి అనుభవం ఎదురైనప్పుడల్లా మనం ఈ లైన్స్ ను తలచుకుంటూనే ఉంటాం. ఈ ఆర్టికల్ లో చెప్పుకోబోయే స్టోరీ కూడా అలాంటిదే. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంలో పుట్టిన ఈ అమ్మాయి సాఫ్ట్ వేర్ రంగంలో ఎదిగింది.

Video Advertisement

తాను టైలర్ ని అవుతాను అని ఎప్పుడు ఆమె అనుకోలేదు. అసలు సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి మరీ టైలర్ అవ్వడం వెనుక అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

sushmitha 2

ఈ అమ్మాయి పేరు సుష్మిత లకాకుల. ఆమె పుట్టి పెరిగినదంతా హైదరాబాద్ లోనే. ఇంట్లో అందరు ప్రభుత్వ ఉద్యోగులే. తల్లి సునంద, తండ్రి బాలకృష్ణ, ఎస్‌బీహెచ్‌లో మేనేజర్‌గా చేసి రిటైర్ అయ్యారు. తాను కూడా బీసీఏ చదివి ఆ తరువాత బిట్స్‌ పిలానీ నుంచి ఎం.ఎస్‌., ఐఐఎం కోల్‌కతా నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ను చదివింది. ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి పొజిషన్ లో ఉద్యోగం చేస్తోంది.

sushmitha

విప్రో, డెల్‌, క్వాంటమ్‌ లాంటి సంస్థల్లో కూడా ఆమె పని చేసింది. అయితే.. నాకెప్పుడూ సొంతంగా ఎదో ఒకటి చేయాలి అని ఉండేది అని చెప్పుకొస్తారు సుష్మిత. లాక్ డౌన్ టైం లో ఉన్నపుడు ఆమెకు చిన్న పాప ఉండేది. ప్రస్తుతం వీరు కోకాపేటలో ఉంటున్నారు. తనకి ఎప్పుడు దుస్తుల్ని రెడీ మేడ్ గా కొనుక్కోవడం కంటే.. కుట్టించుకోవడమే అలవాటు. అయితే.. లాక్ డౌన్ సమయంలో మాత్రం అది కుదరలేదు. ఆన్ లైన్ లో ఎవరైనా కుట్టేవారు దొరుకుతారేమోనని చాలా వెతికింది. ఇంటికి వచ్చి కొలతలు తీసుకుని కొట్టేవాళ్ళు ఎవరైనా ఉంటె బాగుండు అనుకుంది.

sushmitha 3

అయితే ఆన్ లైన్ లో అలా ఏమీ దొరక్క పోవడంతో.. తానె ఆ పని ఎందుకు ప్రారంభించకూడదు అనుకుంది. ఈ విషయాన్నీ భర్తతో చెబితే ఏదైనా యాప్ అయితే బాగుంటుందని సూచించారు. దీనితో టైలరింగ్, మాస్టర్స్ అందరిని కలుపుని యాప్ ఆధారిత బోటిక్ ను ప్రారంభించాలని అనుకున్నాం. అందుకోసం ప్రయత్నాలు చేసాం. అలా 2020 డిసెంబర్ లో ‘క్లౌడ్‌ టైలర్‌’ ను ప్రారంభించాం. ఇపుడు ఫ్యాషన్ డిజైనర్లు, యాప్ డెవలప్మెంట్ కు ఒక టీం, మాస్టర్ టైలర్లు కలిపి మొత్తం ముప్పై మందికి పైగా పని చేస్తున్నారు. లాక్ డౌన్ టైం ఇబ్బంది పడ్డ అందరికి ఈ యాప్ ఉపయోగపడుతుందనిపించింది.

sushmitha 1

మొదటగా సన్నిహితులు, మా అపార్ట్మెంట్ వారు సపోర్ట్ గా నిలిచారు. ప్రస్తుతం ఇతర నగరాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. మధ్య తరగతి వారికి అందుబాటులోనే ఈ ధరలు ఉంటాయి. యాప్ లో లాగిన్ అయ్యి అవసరమైన వివరాలు అందిస్తే అది ఓ ఫ్యాషన్ డిజైనర్ కి సబ్మిట్ అవుతుంది. అవసరమైతే వాయిస్ ఫైల్ ను కూడా పంపించొచ్చు. అవసరమైన సూచనలు ఇవ్వొచ్చు. అన్ని ఒకే అయ్యాక కస్టమర్ కి కావాల్సిన విధంగా కుట్టి పంపిస్తారు. కస్టమర్లతో మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు యాప్ ని డెవెలప్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే.. వినియోగదారులకు సమయానికి అందించే విషయం పైన కూడా దృష్టి పెడుతున్నాం.


End of Article

You may also like