Ads
ఐపీఎల్ 2020 చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి అంత పెద్దగా కలిసి రాలేదు అనే చెప్పాలి. మొదటి సారిగా మ్యాచ్లో పాల్గొన్నప్పటికీ కూడా ప్లే ఆఫ్స్ మిస్ అవుతున్నారు. మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ఈ సారి మాత్రం అంత మంచి ఫలితాలను ఇవ్వలేకపోయారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ ఆడిన మొదటి సీజన్ ఇది.
Video Advertisement
ధోని ఆటతీరుపై అభిమానులకు చాలా అంచనాలు ఉన్నాయి. రిజల్ట్ కొంచెం అటు ఇటు అయింది. ధోని ప్లే ఆఫ్ లో ఆడకపోవడం ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో సారి. అంతకుముందు 2016 లో ఒక సారి ధోని రైజింగ్ పూణే సూపర్ జయింట్ లో ఉన్నప్పుడు ఇలా జరిగింది. ఇదే కాదు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, రైజింగ్ పూణే సూపర్ జయింట్ జట్టుకి మధ్య కొన్ని కో ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
#1 చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2020 లో ఆడిన మొదటి 11 మ్యాచ్ లలో మూడు మ్యాచ్లు గెలిచింది ఎనిమిది మ్యాచ్లు ఓడిపోయింది. రైజింగ్ పూణే సూపర్ జయింట్ జట్టు కూడా మొదట ఆడిన 11 మ్యాచ్ లలో మూడు మ్యాచ్లు గెలిచారు. కానీ తరువాత చివర్లో రెండు మ్యాచ్లు గెలిచారు. అలా 14 మ్యాచ్ లలో 10 పాయింట్లతో సీజన్ ముగించారు.
#2 ఐపీఎల్ 2016 లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో రైజింగ్ పూణే సూపర్ జయింట్ జట్టు తమ మొదటి మ్యాచ్ ఆడింది. ఇందులో ముంబై ఇండియన్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఐపీఎల్ 2020 లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ తమ మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ జట్టు తో ఆడింది. ఇందులో 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.
#3 మహేంద్ర సింగ్ ధోనీ జట్టులో తను కాకుండా ఇంకో వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. 2016 ఐపీఎల్ లో ఆర్పిఎస్ లో అంకుష్ బెయిన్స్ మరియు పీటర్ హ్యాండ్స్కాంబ్ వికెట్ కీపర్స్ గా ఉన్నారు.
2020 ఐపీఎల్ లో అవసరమైన సందర్భాల్లో నారాయణ్ జగదీసన్, అంబటి రాయుడు కూడా వికెట్ కీపింగ్ కి ఆప్షన్స్ గా ఉన్నారు. కానీ ధోని అన్ని గేమ్స్ ని తనే ఆడుతాను అని చెప్పారు. దాంతో బ్యాక్ అప్ వికెట్ కీపింగ్ సర్వీసెస్ అవసరం ఉండదు.
#4 మహేంద్రసింగ్ ధోని పదకొండు సార్లు ఐపిఎల్ ప్లే ఆఫ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. కానీ 2016 లో రైజింగ్ పూణే సూపర్ జయింట్ జట్టు, అలాగే 2020 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాప్ 4 లో చోటు దక్కించుకోలేకపోయాయి.
ఐపిఎల్ 2020 లో సిఎస్కె కేవలం మూడు ఆటలను మాత్రమే గెలిచినప్పటికీ కూడా, మ్యాథమెటికల్ గా చూస్తే ప్లే ఆఫ్ లోకి వెళ్లే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం అలా జరగడానికి ఛాన్సెస్ చాలా అరుదుగా ఉన్నాయి.
#5 మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా చాలా మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ కలిసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఎనిమిది సీజన్లు ఆడారు. కానీ 2016 లో ధోని ఆర్పిఎస్ కెప్టెన్ గా, రైనా జిఎల్ (గుజరాత్ లయన్స్) కు కెప్టెన్ గా వ్యవహరించారు. 2017 లో, స్టీవ్ స్మిత్ పూణే జట్టుకి కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యారు. ఇలా, రైనా లేకుండా ధోని 2016 మరియు 2020 లో ఐపీఎల్ జట్లకు కెప్టెన్సీ వహించారు.
End of Article