భారత సాంప్రదాయం ప్రకారం  సహజీవనం అనేది మన సంస్కృతిలో లేదు. మనం ఏది చేయాలన్నా అది వివాహం తర్వాత అని మన పెద్దల నుంచి సాంప్రదాయం కొనసాగుతోంది. ఒకవేళ అది కాదనీ ఏ అమ్మాయి అయినా అలా చేస్తే చెడిపోయంది అన్న ముద్ర పడుతుంది. కానీ తెగలో వివాహానికి ముందే సహజీవనం చేయొచ్చు. పిల్లలను కూడా కనవచ్చు.

ఒకవేళ నచ్చకుంటే అతనితో విడిపోవచ్చు కూడా.. అంతా కామన్ అక్కడ.. మరి అదేదో పాశ్చాత్య దేశం అనుకునేరు.. కాదండి మన భారతదేశంలోనే.. ఈ సంస్కృతి దాదాపుగా 200 సంవత్సరాల నుంచి కొనసాగుతుందట. ఇంతకీ ఆ తెగ ఎక్కడ ఉంది అంటే ఉత్తర భారతదేశం.. వీరి యొక్క ఆచారాలు సాంప్రదాయాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం..!! మన సాంప్రదాయం ప్రకారం ఆడవారు ఏది చేయాలన్నా అది పెళ్లి తర్వాతే.. ఒకవేళ పెళ్లికి ముందు గర్భందాల్చిన, పిల్లల్ని కన్న వారిని సమాజం

తీవ్రమైన తప్పు పడుతుంది. కానీ “గరసియా” అనే తెగ మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. వారి వివాహానికి ముందే సహజీవనం చేసి పిల్లల్ని కూడా కనే సంప్రదాయం అక్కడ ఉంది. దీని గురించి ప్రశ్నించే హక్కు కానీ, అధికారం కానీ అక్కడ ఎవరికీ లేదంటే వారి సంప్రదాయం ఏ విధంగా ఫాలో అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఈ తెగ గుజరాత్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో విస్తరించి ఉంది. వీరి సంప్రదాయం ప్రకారం వయసులో ఉన్న అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకొని నిర్ణీత సమయంలో రెండురోజుల పాటుగా ఆమెతో గడపవచ్చు. అక్కడ ఒక జాతర కూడా జరుగుతుంది. ఈ జాతరలో వారు వారికి నచ్చిన అబ్బాయిని తీసుకొని.. వివాహంతో సంబంధం లేకుండా సహజీవనం చేయవచ్చు.. ఈ సందర్భంలో అబ్బాయి తరపు కుటుంబ సభ్యులు కొంత సొమ్మును అమ్మాయి కుటుంబ సభ్యులకు అందించి వారితో సహజీవనాన్ని ప్రారంభిస్తారు. అంటే ఇది ఒక రకం ఎదురు కట్నం లాగా అన్నమాట.

వివాహం కూడా నామమాత్రమే: అయితే ఇక్కడ అబ్బాయి అమ్మాయి కలిసి కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేసే ఆచారం ఉంది. ఈ క్రమంలో పిల్లల్ని కూడా కనవచ్చు. ఈ విధంగా అక్కడి ప్రజలు స్త్రీలకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తారని తెలుస్తోంది. కానీ ఈ ఆచారం మనకు వింతగా అనిపించవచ్చు. దీనివల్ల అమ్మాయిలపై అఘాయిత్యాలు వేధింపులు వంటివి తగ్గించవచ్చని అక్కడి వారు చెబుతున్నారు.