• చిత్రం : పంచతంత్రం
 • నటీనటులు : బ్రహ్మానందం, సముద్రఖని, కలర్స్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్, ఉత్తేజ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీ పాద
 • నిర్మాత : అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు
 • దర్శకత్వం : హర్ష పులిపాక
 • సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
 • విడుదల తేదీ : డిసెంబర్ 9 , 2022

panchatantram telugu-movie-story-review-rating

Video Advertisement

స్టోరీ :

ఇది ఐదు కథల సమాహారం. పంచేంద్రియాల చుట్టూ తిరిగే ఐదు కథలను ఆవిష్కరించే చిత్రం. వేదవ్యాస్‌(బ్రహ్మానందం) ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైర్‌ అవుతాడు. ఇంట్లో బోర్‌ కొడుతుండటంతో స్టోరీ టెల్లర్‌గా కొత్త కెరీర్‌ని ప్రారంభించాలనుకుంటాడు. స్టాండప్‌ స్టోరీ టెల్లింగ్‌ పోటీలకు వెళ్లాలనుకుంటాడు. కానీ ఇంట్లో తన కూతురు రోషిణి(కలర్‌ స్వాతి) ఆయన కోరికని అర్థంచేసుకోకుండా నిరుత్సాహపరుస్తుంది. అక్కడ పంచేంద్రియాల కాన్సెప్ట్ తో ఐదు కథలు చెబుతాడు.

మొదటి కథః మొదటి స్టోరీ దృశ్యం చుట్టూ తిరుగుతుంది. నరేష్‌ అగస్త్య సాఫ్ట్ వేర్‌ ఉద్యోగి. మంచి ఉద్యోగం చేస్తున్నా, ఏదో తెలియని అసంతృప్తి. అయితే బీచ్‌ గురించి విన్నప్పుడు అతనిలో తెలియని ఉత్సాహం కలుగుతుంది. మరి ఆ ఉత్సాహానికి కారణం ఏంటి? బీచ్‌కి దృశ్యానికి సంబంధం ఏంటనేది కథ.

panchatantram telugu-movie-story-review-rating

రెండో కథః రుచి గురించి తెలియజేసే కథ. రాహుల్‌ విజయ్‌కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఈ క్రమంలో అమ్మ ఒత్తిడి మేరకు చివరగా శివాత్మిక రాజశేఖర్‌ ని చూస్తాడు. పేరెంట్స్ కి నచ్చిందనే ఉద్దేశంతో ఆమెకి ఓకే చెబుతాడు. మరి రుచికి, వీరిద్దరు కలుసుకోవడానికి సంబంధం ఏంటనేది మిగిలిన కథ.

మూడో కథః వాసన గురించి తెలియజేసే కథ. సముద్రఖని బ్యాంకులో జాబ్‌ చేసి రిటైర్డ్ అవుతాడు. ఇంట్లో ఖాళీగా ఉంటాడు. కానీ ఆయనకు కొన్ని సార్లు బాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ మానసిక రోగం నుంచి ఆయన ఎలా బయట పడ్డాడు అనేదే ఈ కథ.

panchatantram telugu-movie-story-review-rating

నాలుగో కథ: స్పర్శలోని అనుభూతిని తెలిపే కథ ఇది. వికాస్‌ ముప్పాల, దివ్య శ్రీపాద ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయితే దివ్య కి క్యాన్సర్‌ గా తేలుతుంది. మరి వికాస్‌, దివ్య శ్రీపాద తీసుకున్న నిర్ణయమేంటి? స్పర్శకి ఉన్న సంబంధం ఏంటనేది మిగిలిన కథ.

ఐదో కథః వినికిడిలోని గొప్పతనం తెలియజేసే కథ ఇది. లియా అనే పేరుతో చిన్న పిల్లల స్టోరీస్‌ చెబుతుంది కలర్స్ స్వాతి. వాటికి ఎంతో మంది చిన్నారులు అభిమానులుగా మారిపోతుంటారు. అలా ఉత్తేజ్‌ కూతురు కూడా పెద్ద ఫ్యాన్. స్వాతికి, ఉత్తేజ్‌ కూతురుకి ఉన్న సంబంధం ఏంటి? ఉత్తేజ్‌ కూతురు స్వాతిలో తెచ్చిన మార్పేంటి? వినికిడి పోషించిన పాత్ర ఏంటనేది మిగిలిన కథ.

panchatantram telugu-movie-story-review-rating

ఈ ఐదు కథలు చెప్పడం వల్ల వేదవ్యాస్‌ జీవితం ఎలా మారిందనేది సినిమా కథ.

రివ్యూ :

కమర్షియల్‌ అంశాలు అతీతంగా ఒక ఫీల్‌ని, పంచేంద్రియాలను థీమ్‌గా తీసుకుని కథ అల్లుకున్నాడు దర్శకుడు హర్ష పులిపాక. మొదటగా ఇలాంటి ఐడియాతో సినిమా తీయాలనే దర్శకుడి ఆలోచనను మెచ్చుకోవలసిందే. ఐదు కథలను అల్లుకున్న తీరు, వాటికి పంచేంద్రియాల కాన్సెప్ట్ ముడిపెట్టడం బాగుంది.

అయితే కథల పరంగా చూస్తే అన్ని కథల అడియెన్స్ ని అంతటి ఫీల్‌కి గురి చేయలేకపోయాయి. అయితే సినిమా వెళ్లే కొద్దీ, ఆ ఫీల్‌ని పెంచుకుంటూ వెళ్లాడు దర్శకుడు. ఐదో కథకి వచ్చేసరికి దాన్ని మరింత పీక్‌లోకి తీసుకెళ్లాడు. కలర్స్ స్వాతి, రూప అనే చిన్నారి మధ్య పెట్టిన సన్నివేశాలు, రూప పాత్రలోని ట్విస్ట్ ఆడియెన్స్ చేత కన్నీళ్లు పెట్టిస్తాయి. ఓ బరువెక్కిన హృదయంతో ఆడియెన్స్ బయటకు వస్తారు.

panchatantram telugu-movie-story-review-rating
దర్శకుడు ఈ ఐదు కథలను, వేద వ్యాస్‌ అనే పాత్ర ద్వారా ముడిపెట్టిన తీరు బాగుంది. క్లైమాక్స్ అదరగొడుతుంది. అయితే సినిమా కాస్త స్లోగా సాగడం ఆడియెన్స్ ఓపికకి పరీక్ష పెట్టే అంశం. ఇలాంటి సినిమాలకు థియేటర్లలో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చెప్పలేంగానీ, ఓటీటీకి మాత్రం బెస్ట్ ఛాయిస్‌.

panchatantram telugu-movie-story-review-rating

కామెడీ పాత్రల్లో కనిపించే బ్రహ్మానందం కి ఇదొక డిఫరెంట్‌ రోల్‌. సీరియస్‌ రోల్స్ లోకి టర్న్ తిప్పే సినిమా అవుతుంది. ఇక ఆయన నటన గురించి చెప్పేదేం లేదు. నవ్విస్తున్నట్టే అనిపించి హృదయాన్ని బరువెక్కించాడు. కలర్స్ స్వాతికిది కమ్‌ బ్యాక్ లాంటి సినిమా అవుతుంది. ఆమె పాత్రకి ప్రాణం పోసింది. రాహుల్‌ విజయ్‌, శివాత్మిక, అగస్త్య తమ పాత్రల మేరకు డీసెంట్‌గా బాగా చేశారు. సముద్రఖని నటనతో తన కథని నిలబెట్టారు. దివ్య శ్రీపాద, వికాస్‌ అద్భుతంగా చేశారు. ఆదర్శ్‌ బాలకృష్ణ, ఉత్తేజ్‌, రూప పాత్రలో చిన్నారి సైతం బాగా చేశారు.

ప్లస్ పాయింట్స్ :

 • నటీనటులు
 • సంగీతం
 • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

 • వినోదం లేకపోవడం
 • కథల్లో కనెక్టివిటీ మిస్ అవ్వడం
 • కొన్ని సాగతీత సీన్లు

రేటింగ్ :

2 .75 /5

ట్యాగ్ లైన్ :

మంచి ఫీల్ గుడ్ మూవీ. కానీ థియేటర్లకంటే ఓటీటీలకి మంచి ఛాయిస్.