పెళ్లి చూపులు సినిమా విజయ్ దేవరకొండ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. మరో వైపు.. కమెడియన్ గా ప్రియదర్శికి కూడా మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది. వరుస అవకాశాలు రావడం తో ప్రియదర్శి కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. కమెడియన్ గా మంచి అవకాశాలను అందిపుచ్చుకున్నారు. తాజాగా.. ప్రియదర్శి శ్రీదేవి డ్రామా కంపెనీ షో కు హాజరు అయ్యారు.

priyadarsi 2

ఈ షో లో సెలెబ్రిటీలు కూడా వచ్చి సందడి చేస్తూ ఉంటారు. ఈ షో కి కూడా సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో లో కూడా సుధీర్ ట్రోలింగ్ ను ఎదుర్కొంటు.. తనదైన టైమింగ్ తో పంచ్ లు వేసి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇటీవలే ఈ షో కి సంబంధించి నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో ను రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

priyadarsi 1

ఈ ప్రోమో లో ప్రియదర్శి వేసిన పంచ్ లు హైలైట్ గా నిలిచాయి. గెస్ట్ గా వచ్చిన ప్రియదర్శి వస్తూనే రచ్చ రచ్చ చేసాడు. సుడిగాలి సుధీర్..”నా చావు నేను చస్తా..” అన్న బుక్ రాశారు కదా మీరు.. అది పబ్లిష్ అయిందా అని అడిగేసరికి.. “నీకెందుకురా హౌలే” అనే పబ్లిషర్స్ వారు ఆ బుక్ ని పబ్లిష్ చేస్తున్నారు అని చమత్కారం గా సమాధానం ఇచ్చారు. సుధీర్ అవాక్కయి చూస్తుంటే.. షో లో నవ్వులు పూశాయి.