ఇటీవల కాలంలో హాస్యనటులు హీరోలుగా లేదా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. హాస్యనటులు ప్రధాన పాత్రలలో నటించే ట్రెండ్ ఇప్పుడు వచ్చింది కాదు. అప్పట్లో హాస్యనటులు కూడా లీడ్ రోల్ లో నటించారు.
Video Advertisement
అలా తెలుగులో గతంలో పద్మనాభం, రాజబాబు వంటి హాస్య నటులు చాలా సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. వారి లాగే ఇటీవల కాలంలో కూడా కొందరు హాస్యనటులు హీరోలుగా మరియు ప్రధాన పాత్రలలో పలు సినిమాలలో నటించారు. ఏ హాస్యనటులు ఏ చిత్రాలలో లీడ్ రోల్ లో నటించారో ఇప్పుడు చూద్దాం..
1. ఆలీ:
హాస్యనటుడు అలీ బాలనటుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. హాస్యనటుడుగా ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అలీ యమలీల సినిమాలో తొలిసారి హీరోగా నటించాడు. కమెడియన్ పాత్రలు చేస్తూనే అప్పుడపుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు.
2. వేణుమాధవ్:
హాస్యనటుడు వేణుమాధవ్ వందల చిత్రాలలో నటించి తనదైన కామెడీ టైమింగ్ తో ఆడియెన్స్ అలరించాడు. భూకైలాస్, హంగామా చిత్రాలలో వేణుమాధవ్ హీరోగా నటించాడు.
3. కృష్ణ భగవాన్:
ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా అలరించిన కృష్ణ భగవాన్ ‘జాన్ అప్పారావ్ 40 ప్లస్’చిత్రంలో హీరోగా నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రన్ నటించడం విశేషం.4.వెన్నెల కిషోర్:
టాలీవుడ్ లో పాపులర్ హాస్యనటుడు వెన్నెల కిషోర్. తన మార్క్ కామెడీతో ఆడియెన్స్ ని అలరిస్తున్నాడు. 2013లో వచ్చిన ‘అతడు ఆమె మరియు స్కూటర్’ అనే చిత్రంలో తొలిసారిగా హీరోగా నటించాడు. ప్రియాంక ఛబ్రా ఈ మూవీలో హీరోయిన్‌గా నటించింది.
5. శ్రీనివాస్ రెడ్డి:
హాస్యనటుడిగా తనదైన కామెడీతో ఆకట్టుకునే శ్రీనివాస్ రెడ్డి ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రంలో పూర్ణ హీరోయిన్ గా నటించింది.
6. సునీల్:
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ సునీల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ‘మర్యాద రామన్న’ సినిమాలో హీరోగా నటించాడు. అందాల రాముడు మూవీతో హీరోగా మారాడు. ఆ తరువాత నాలుగైదు చిత్రాలలో హీరోగా నటించాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలో మంగళం శీను గా విలన్ పాత్రలో నటించాడు.
7. సప్తగిరి:
సప్తగిరి కమెడియన్ గా పలు చిత్రాలలో నటించి పాపులర్ అయ్యాడు. అతను కమెడియన్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో హీరోగా మారాడు.
8. గెటప్ శ్రీను:
జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు సంపాదించుకున్న గెటప్ శ్రీను ‘3 మంకీస్’అనే చిత్రంలో ముగ్గురి హీరోలలో ఒకడిగా నటించాడు.
9. శకలక శంకర్:
జబర్దస్త్ కమెడియన్ గా పాపులర్ అయిన శంకర్ తొలిసారి హీరోగా ‘శంభో శంకర’ అనే చిత్రంలో నటించాడు. ఆ తరువాత భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు అనే చిత్రంలో మరో ఇద్దరు కామెడియన్స్ తో కలిసి నటించారు.
10. రాం ప్రసాద్:
జబర్దస్త్ కమెడియన్ గా పాపులర్ అయిన రాం ప్రసాద్ ‘3 మంకీస్’అనే చిత్రంలో ముగ్గురి హీరోలలో ఒకడిగా నటించాడు.
11. సత్య:
కమెడియన్ గా టాలీవుడ్ లో గుర్తింపు పొందిన నటుడు సత్య. ‘భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు’ అనే చిత్రంలో ముగ్గురు హీరోలలో ఒకరిగా నటించాడు. ‘వివాహభోజనంబు’ చిత్రంలో హీరోగా నటించాడు.
12. సుడిగాలి సుధీర్:
సుడిగాలి సుధీర్ జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా పాపులర్ అయ్యారు. పలు సినిమాలలో కమెడియన్ గా నటించాడు.’సాఫ్ట్ వేర్ సుధీర్ ‘ చిత్రంలో మొదటిసారిగా హీరోగా నటించాడు. ఆ తరువాత 3 మంకీస్, గాలోడు చిత్రాలలో హీరోగా నటించారు.
13. రాహుల్ రామకృష్ణ:
అర్జున్ రెడ్డి సినిమాతో గుర్తింపు సంపాదించించుకున్న రాహుల్ రామకృష్ణ పలు చిత్రాలలో నటించాడు. మిఠాయి చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. ‘జాతిరత్నాలు’ సినిమాలో ముగ్గురు హీరోలలో ఒకరిగా నటించాడు.
14. ప్రియదర్శి:
పెళ్ళి చూపులు చిత్రంతో పాపులర్ అయిన ప్రియదర్శి. మల్లేశం చిత్రంలో మొదటిసరిగా హీరోగా నటించాడు. ఆ తరువాత జాతిరత్నాలు సినిమాలో ముగ్గురు హీరోలలో ఒకరిగా నటించాడు. ఇటీవల విడుదలయిన బలగం సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించాడు.
15. సూరి
తమిళ హాస్యనటుడు సూరి వెట్రిమారన్ దర్శకత్వంలో తాజాగా రీలీజ్ అయిన ‘విడుదల పార్ట్ 1’ లో మొదటిసారిగా ప్రధాన పాత్రలో నటించారు.
Also Read: ఈ 10 నటులని మనం చాలా సినిమాల్లో చూస్తాం.! కానీ వీరి అసలు పేర్లు ఏంటో తెలుసా..?