మనం చిత్రాల్లో ఎంతోమంది నటీనటులును చూస్తూ ఉంటాం. చిత్రాల్లో వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ కి తగ్గట్లు నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే క్యారెక్టర్ అద్భుతంగా వుండడంతో వారి క్యారెక్టర్ పేరు మాత్రమే గుర్తుపెట్టుకుంటాం కానీ , అసలు పేర్లు తెలుసుకోవడానికి ప్రయత్నిచాము.

Video Advertisement

ఆ నటీనటులు నటించిన క్యారెక్టర్ గుర్తుంటాయి గాని, వాళ్ళ అసలు పేర్లు తెలియని వారు చాలా మంది ప్రేక్షకులు ఉన్నారు. అలాంటి పదిమంది ఫేమస్ సెలబ్రెటీల అసలు పేర్లు గురించి తెలుసుకుందాం.

#1. సుధ :

నువ్వు నాకు నచ్చావ్,  మన్మధుడు, అతడు వంటి ఎన్నో ఫేమస్ చిత్రాల్లో  నటించారు. ఈవిడ దాదాపు 500 చిత్రాలకు పైగా సినిమాల్లో నటించారు. కానీ ఈమె అసలు పేరు ఇప్పటివరకు చాలా మందికి తెలియకపోవచ్చు. ఆమె అసలు పేరు సుధ.

#2. తులసి :

ఈమెను మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, బ్రహ్మోత్సవం, ఇలా ఎన్నో చిత్రాలలో చూశారు. ఈమె అసలు పేరు తులసి.

#3.శంకర్ మాల్కోటి:

ఈయన దాదాపు 2000 చిత్రాలకు పైగా నటించారు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు వంటి చిత్రాలు చూస్తే ఈయన మీరు గుర్తు పడతారు. ఈయన అసలు పేరు శంకర్ మాల్కోటి.

#4.సత్య కృష్ణన్:

ఈవిడ మెంటల్ కృష్ణ, బొమ్మరిల్లు, దూకుడు చిత్రాలతో  అందరికీ పరిచయమే. ఈవిడకు వాయిస్ తో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఆమె అసలు పేరు సత్య కృష్ణన్.

#5.చైతన్య కృష్ణ:

దృశ్యం, చందమామ కథలు, ప్రాణం వంటి చిత్రాలలో ఈయనను సైడ్ క్యారెక్టర్ గా చూస్తూనే ఉంటాం. ఇతను అసలు పేరు చైతన్య కృష్ణ.

#6.సుప్రీత్ రెడ్డి:

రాజమౌళి చిత్రాల్లో ఈయను చాలా సార్లు విలన్ పాత్రలో చూసే ఉంటారు. ఈయన చేసే క్యారెక్టర్ పేరు కాట్ రాజ్ అని గుర్తుంటుంది గాని, ఈయన అసలు పేరు ఎవరికీ తెలియదు. ఇతని అసలు పేరు సుప్రీత్ రెడ్డి.

#7.ఆదిత్య మీనన్:

ఈయన్ను మిర్చి, ఈగ,దూకుడు చిత్రాల్లో చూసే ఉంటారు. ఈయన అసలు పేరు ఆదిత్య మీనన్

#8.కెల్లీ డోర్జి:

ఇతను నాగార్జున డాన్ చిత్రంలో, నేనొక్కడినే, ఇలా వంటి చిత్రాల్లో చూసే ఉంటారు. ఇంటర్నేషనల్ తెలుగు విలన్ గా ఎన్నో పాత్రలు చేశారు. ఇతని అసలు పేరు కెల్లీ డోర్జి.

#9.ప్రదీప్ రావత్:

ఈయన సై చిత్రంలో భిక్షుయాదవ్ గానే అందరికీ బాగా పరిచయం. అనేక తెలుగు చిత్రాల్లో నటించారు. ఈ భిక్షుయాదవ్ అసలు పేరు ప్రదీప్ రావత్.

#10.భరత్ రెడ్డి:

ఇతను మనం ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్ లో చూస్తూ ఉంటాం. బిజినెస్ మాన్, రాజా ది గ్రేట్ వంటి అనేక చిత్రాలలో నటించారు. ఈయన అసలు పేరు భరత్ రెడ్డి.