Ads
ఏ పూజకు అయినా ముందు వినాయకుడిని ఆరాధించడం తప్పనిసరి. అలాంటిది సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడు జన్మించిన చవితి రోజున.. ఆయనకు మరింత విశేషం గా పూజలు చేసుకుంటూ ఉంటాం. వినాయక ఉత్సవాలు దేశమంతటా ఘనం గా జరుగుతాయి. నవరాత్రులు ఆ విఘ్నేశ్వరుడిని కీర్తించి.. ఆ తరువాత తొమ్మిదో రోజు రాత్రికి నిమజ్జనం చేస్తారు. ఈ తొమ్మిది రోజులు దేశమంతా విశేషం గా సంబరాలు జరుగుతాయి.
Video Advertisement
కొన్ని రోజుల ముందు నుండే హడావిడి మొదలయ్యింది. క్రిందటి సంవత్సరం కరోనా వల్ల పెద్ద ఎత్తున జరుపుకోలేదు. కానీ ఈ సారి అందరు జోష్ లో ఉన్నారు.ప్రతి వీధికి వినాయకుడి మండపాలు, రోజు మొత్తం మండపం నుండి వినిపించే పాటలు, ప్రతిరోజు సాయంత్రం కాలనీలో ఉండే ఒక కుటుంబం వచ్చి పూజ చేయడం, అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి.
ఈ సంబరాల్లో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరు పాల్గొంటూ భజనలు, కీర్తనలు చేస్తుంటారు. సందుకో పందిరి వెలిసినా.. అందరు కలిసి గణేష్ మహారాజ్ ను ప్రార్ధిస్తారు. “గణపతి బప్పా మోరియా” అంటూ కీర్తిస్తారు. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు.
# RRR – Ramaraju Ganesha
#RRR – Bheem ganesha
అయితే సినిమాల ప్రభావం మన సమాజంలో ఎంత ఉంటుందో అందరికి తెలిసిందే. ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఈ ట్రెండ్ ఎఫెక్ట్ గణేష్ విగ్రహాల మీద కూడా పడింది. RRR , KGF , పుష్ప సినిమాల క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. ఈ సినిమా పాత్రలను పోలుస్తూ గణేష్ విగ్రహాలను ప్రతిష్టించారు ఈ వినాయక చవితికి. ఆ ఫొటోలో నెట్ ఇంట వైరల్ అవుతున్నాయి.
# Pushap – Pushpa Ganesha
#KGF – Rocky Bhai Ganesha
ఆ ఫోటోలపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సరదాగా తీసుకుంటుంటే…మరికొందరు పుష్ప, రాఖీ భాయ్ పాత్రలు నెగటివ్ కదా..? అలా విగ్రహాలను చేసి ఎందుకు అపహాస్యం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి పరాకాష్టకు వెళ్ళింది అనుకోవాలా.? లేక దేవుడు అన్ని రూపాల్లోనూ ఉంటాడు అనుకోని క్రియేటివిటీ ని ప్రోత్సహించాలా.? దీనిపై మీ అభిప్రాయం ఏంటి.?
End of Article