ఈ మధ్య కాలంలో ఒక మూవీ విజయం సాధిస్తే ప్రశంసలు లభిస్తున్నాయి. కానీ మూవీ ప్లాప్ అయితే వచ్చే విమర్శలు మాత్రం మామూలుగా ఉండట్లేదు. ఆ చిత్రం ఎంత పెద్ద హీరోది అయిన విమర్శలు, సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ దారుణంగా ఉంటున్నాయనే విషయం అందరికి తెలిసిందే.
Video Advertisement
రీసెంట్ గా రిలీజ్ అయిన “ఏజెంట్” మూవీ పరిస్థితి అలాగే ఉంది. ఈ సినిమా విడుదలకు ముందు మేకర్స్ మూవీ గురించి గొప్పగా చెప్పారు. కానీ మూవీ డిజాస్టర్ అవడంతో ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. రీసెంట్ గా నిర్మాత పెట్టిన ట్వీట్ పై అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం పెట్టిన దానిలో 10 శాతం కూడా వసూలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. మూవీ చూసిన వారు దర్శకుడిగా 17 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు అంటే నమ్మలేకపోతున్నామని అంటున్నారు. ఇక ఈ చిత్ర నిర్మాత అనీల్ సుంకర మూవీ ఫెయిల్యూర్‌ను అంగీకరిస్తూ ట్వీట్ చేశాడు. అందులో బౌండెడ్ స్క్రిప్ట్ తమ దగ్గర లేకుండా చిత్రాన్ని మొదలు పెట్టి ఖరీదైన తప్పు చేశామని అన్నారు.
దీనిని చూసిన వారు ఇండస్ట్రీలో ఓ నిర్మాత ఇలా పరాజయాన్ని, మూవీ విడుదలైన 4 రోజులకే అంగీకరించడం చాలా అరుదుగా జరిగే విషయమని అంటున్నారు. అయితే నిర్మాత అనీల్ సుంకర తన ట్వీట్ లో చెప్పిన బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా మూవీని మొదలు పెట్టి తప్పుచేశాం అనే దాని పై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే హీరో అఖిల్ అక్కినేని బాడీని బిల్డప్ చేయించారా? అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అఖిల్ చాలా హార్డ్ వర్క్ చేసి తన బాడీని బిల్డప్ చేసుకున్నారని, ఆయన శ్రమకు తగిన ఫలితం లేదని కామెంట్స్ చేస్తున్నారు. 2 ఏళ్లకు పైగా ఒక మూవీ కోసం కష్టపడ్డ అఖిల్ కెరీర్ లో ఈ చిత్రం మాయని మచ్చలా ఎప్పటికి ఉండిపోతుందని అంటున్నారు. ఈ మూవీ డిజాస్టర్ కు కారణం మూవీ యూనిట్ మాత్రమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: “సునీల్” నుండి… “సూరి” వరకు… “హీరో” లుగా మారిన 15 కమెడియన్స్..!