“అప్పుడే నయం ఏమో..!” అంటూ… “చిరంజీవి” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“అప్పుడే నయం ఏమో..!” అంటూ… “చిరంజీవి” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by Anudeep

Ads

చిరు షర్ట్ ఎస్తే మాస్, చిరు స్టెప్ ఎస్తే ఫస్ట్ క్లాస్ అంటుంటారు మెగా స్టార్ చిరంజీవి అభిమానులు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది మరి. నటనకు పర్యాయ పదంగా, ఆపద్బాంధవుడులో ఒక పిచ్చి వాడిలా, డాడిలో ఎంతో గొప్ప తండ్రిగా, స్వయం కృషి లో సాధారణ చేపులు కట్టుకునే వాడిగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన సినిమాలను చేశారు.

Video Advertisement

ఈ తరానికి కూడా గుర్తుండిపోయే పాటలు, స్టెప్పులు, డైలాగులతో ఆయన మెగా క్రేజ్ ను అలానే ఉంచుకున్నారు. కానీ చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత వచ్చిన 150 వ సినిమా నుండి కథల్లో పట్టు, పాటల్లో హిట్టు లేదన్న నిరాశతో చిరు అభిమానులు చింతిస్తున్నారు.

ఇంత పెద్ద వయసు వచ్చినా మంచి కథలను ఎంచుకోకుండా ఇంకా చిన్న వయసు హీరోయిన్లతో స్టెప్పులు ఎందుకని విమర్శిస్తున్నారు. కుర్రాడిలా ఉన్నప్పుడే డాడీ లాంటి పాత్రలు పోషించినవాడివి… ఇప్పుడు ఏమయ్యిందయ్యా చిరంజీవా అంటూ కామెంట్లు చేస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఒకటి చిరు ఇటీవల చేసే సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనింగ్ పెద్దగా ఇష్టపడటం లేదు ఆయన అభిమానులు. ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటి ఇప్పుడు వస్తున్న పాటు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

రెండోది చిరంజీవి సింపుల్ స్టెప్పులు కూడా ఎంతో గ్రేస్ తో ఉండేవి. కానీ ఇప్పుడు వేసే స్టెప్పులు అన్నింటిలోను ఒకేలా ఉంటున్నాయి. ఒకరకంగా అన్నిటికీ శేకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చెయ్యడం, అందులో అన్నీ ఒకేలాంటి స్టెప్పులు పెట్టడం అభిమానులు ఇష్టపడట్లేదు. మూడోది ఒక మంచి కథలో సారాంశం మీద కంటే కూడా ఇంకా కుర్రాడిలా హీరోయిన్ల వెంట పడే వాడిలా చిరంజీవి చూడటానికి ప్రజలు అస్సలు ఇష్టపడట్లేదు అనడానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి.

సైరా నరసింహ రెడ్డి, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో ప్రేక్షకులు చిరంజీవి నుండి ఇటువంటి సినిమాలనే ఆదరిస్తున్నారు అని చెప్పొచ్చు. ఇక వాల్తేరు వీరయ్య కమర్షియల్ హిట్ అవ్వగా… అది మల్టీ స్టారర్ మూవీ కావడం, సినిమా కథ హిట్ అవ్వడానికి ప్లస్ పాయింట్ గా నిలిచాయి అని చెప్పొచ్చు. మొత్తంగా చిరంజీవి ఎక్కువగా డిఫరెంట్ రోల్స్ చేస్తే చూడటానికి అభిమానులు ఇష్టపడుతున్నారని స్పష్టం అవుతోంది.

comments on this point in bholaa shankar teaser

మరి భోళా శంకర్ ఏ మేరకు నచ్చుతుందో చూడాలి. కానీ ఈ వయసులో కూడా ఇప్పుడున్న హీరోలకు పోటీగా, ధీటుగా డ్యాన్సులు వేస్తూ, యంగ్ గా కనిపించాలని ప్రయత్నాలు చేస్తూ… అందరినీ మెప్పించడానికి కష్టపడుతున్నారు చిరంజీవి. అందుకే ఆయన మెగా స్టార్ అయ్యారు అనడంలో సందేహం లేదు. ఏదేమైనా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మరొక మెగా స్టార్ లేరు రారు అనే అభిమానులు ఎంతో మంది లేకపోలేదు.

watch video : 

https://www.instagram.com/reel/CuV_4pjAK-C/?igshid=NjZiM2M3MzIxNA==

ALSO READ : “బ్రో” మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేసిందంటే..?


End of Article

You may also like