స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న సీరియల్ ‘ఇంటింటి గృహలక్ష్మి’. మంచి కథ కథనాలతో మొదలైన ఈ సీరియల్ ఆడియెన్స్ హృదయాలని గెలుచుకుంది. సమస్యల వలయంలో చిక్కుకున్న తన కాపురాన్ని చక్కదిద్దుకునే తెలివైన కోడలి స్టోరీనే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్.

Video Advertisement

అయితే సీరియల్స్ ను సాధారణంగా మహిళలతో పాటు కుటుంబంలోని మిగతా సభ్యులు కూడా చూస్తుంటారు. వారిలో పిల్లలు కూడా ఉంటారు. గత కొన్నిరోజులుగా ప్రసారం అవుతున్న గృహలక్ష్మి సీరియల్ ఎపిసోడ్ల పై ఆడియెన్స్ మండిపడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మొదట్లో ఆసక్తికరంగా సాగిన ఇంటింటి గృహలక్ష్మిని అభిమానించే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సినియర్ హీరోయిన్ కస్తూరి ప్రధాన పాత్రలో నటించిన ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ కూడా తెచ్చుకునేది. అయితే  రాను రాను కథలో వచ్చిన మార్పులతో, కొత్త కొత్త క్యారెక్టర్లతో, సాగగదీసిన డైలాగ్స్ తో ప్రేక్షకుల సహనానికి పరిక్ష పెడుతున్న ఈ సీరియల్, ఆ మధ్యన సామ్రాట్ క్యారెక్టర్ ఎంట్రీతో ప్రేక్షకుల నుండి నెగెటివ్ రెస్పాన్స్, విమర్శలు తీవ్రంగా వచ్చాయి. దాంతో ఆ పాత్రను అర్ధాంతరంగా తొలగించారు.
అయితే ఈ సీరియల్ లో గత కొన్నిరోజులుగా ప్రసారం అవుతున్న ఎపిసోడ్ల పై ఆడియెన్స్ మండిపడుతున్నారు. సీరియల్స్ అంటే కుటుంబంలోని వారంతా కలిసి చూస్తారని, అందులో పిల్లలు కూడా ఉంటారని, అలాంటి సీరియల్స్ లో కూడా ఎక్స్ పోజింగ్ హద్దులు దాటుతోందని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలలో, ఓటీటీల్లో వలె అడల్ట్ కంటెంట్ చూపిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రీసెంట్ గా ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఒకవైపు సామ్రాట్‌ చనిపోయడని, దండ వేసిన సామ్రాట్ ఫొటోను చూస్తూ,  తులసి భోరు భోరున ఏడుస్తూ కూర్చుంది. మరో వైపు తులసి కూతురు దివ్యను బీగ్రేడ్ సినిమాలలో చూపించారని కామెంట్స్ చేశారు. ఇలాంటి సన్నివేశాలు చూపిస్తే, ఆడవాళ్ళు, చిన్న పిల్లలతో ఫ్యామిలీ చూస్తారనే ఇంగితం కూడా లేదా అని తిడుతున్నారు.

Also Read: హీరోగా ఒక వెలుగు వెలిగిన ఈ వ్యక్తికి ఏమైంది..? అతని ఫెయిల్యూర్ కి కారణాలు ఇవేనా..?