యంగ్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ”ఖుషి”. ఈ చిత్రం తాజాగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియన్ సినిమాగా భారీ స్థాయిలో నిర్మించారు. ప్రేమ కథల స్పెషలిస్ట్ శివ నిర్వాణ దర్శకత్వం చేయడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Video Advertisement

ఇక ఈ మూవీకి హేషం అబ్దుల్ సంగీతంలో వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు థియేటర్లలో విడుదల అయిన ఈ మూవీ తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీలోని రెండు సన్నివేశాల పై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా రిలీజ్ అయ్యి, హిట్ టాక్ సొంతం చేసుకుంది. హిట్ టాక్ రావడంతో మూవీ యూనిట్ తో పాటు విజయ్ దేవరకొండ అభిమానులు సంతోషపడుతున్నారు. వారి ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. ఇక ఈ మూవీని చూసినవారు సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి హేషం అబ్దుల్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచిందని అంటున్నారు. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు నెటిజెన్లు ఈ సినిమాలోని రెండు సన్నివేశాల పై ఎక్కువగా కామెంట్స్ పెడుతున్నారు.
ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ పై బైక్ ఫైట్ సన్నివేశం ఉందని, అది అవసరం లేకున్నా పెట్టినట్లుగా ఉందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే కాకుండా మూవీ సెకండాఫ్ లో హీరో తండ్రికి మరియు హీరోయిన్ తండ్రికి మధ్య వచ్చే సన్నివేశాలలో చాలా చిన్న కారణాలకి గొడవ పడినట్టుగా తీశారని అనిపించినట్టుగా నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.

Also Read: “మా కొండన్న హిట్ కొట్టేశాడు..!” అంటూ… విజయ్ దేవరకొండ “ఖుషి” రిలీజ్‌పై 15 మీమ్స్..!