ప్రపంచంలో సినీ ఇండస్ట్రీలో పనిచేసే వారి కల ఆస్కార్ అవార్డు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో ‘నాటు నాటు’ సాంగ్ కు గాను కీరవాణికి ఆస్కార్ వచ్చిన తర్వాత, భారతీయ చిత్ర పరిశ్రమలోని అందరికీ ఆస్కార్ పైన ఆశ కలుగుతోంది.

Video Advertisement

మా సినిమాకి ఎందుకు రాదు అనే భావన బ్లాక్ బస్టర్ దర్శకులకు కలుగుతోంది. రీసెంట్ గా జవాన్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కూడా తమ సినిమాని ఆస్కార్ కి పంపిస్తానని చెప్పడంతో సోషల్ మీడియాలో అతని పై ట్రోలింగ్ జరిగింది. ఈ లిస్ట్ లో మరో రెండు సినిమాలు చేరాయి. వాటి పై నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రీసెంట్ గా “జవాన్”  డైరెక్టర్ అట్లీ తన సినిమాని ఆస్కార్ కి పంపిస్తానని చెప్పగా, నెటిజెన్లు ఆయనను నెట్టింట్లో విపరీతంగా ట్రోల్ చేశారు. పాత మసాలా చిత్రాలన్ని కలిపి కలగూరగంపలా, తీసిన మూవీని ఆస్కార్ కి పంపి ఏం మెసేజ్ ఇస్తారని నెటిజెన్లు గట్టిగా తలంటారు. ఆ ట్రోలింగ్ ఆపకముందే మరో రెండు సినిమాలను ఆస్కార్ కు పంపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
వివాదాస్పద మూవీగా నిలిచిన ది కేరళ స్టోరీని భారత్ తరపున అధికారికంగా ఆస్కార్‌ రేస్ లో నిలిపేందుకు రెడీ  అవుతున్నారనే వార్తలు వైరల్ గా మారాయి. ఈ మూవీలో అదా శర్మ కీలక పాత్ర చేసింది. ఈ మూవీ  బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో అదా శర్మ సంతోషంతో తాను నటించిన మూవీని ఆస్కార్ కు పంపాలని అనుకుంటున్నారని ఎమోషనల్ అయ్యింది. ఆమె ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ పై నెటిజన్లు కౌంటర్లు కూడా వేస్తున్నారు.
మరో సినిమా రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ, ఈ మూవీని కరణ్ జోహర్ తెరకెక్కించారు. ఈ మూవీని కూడా ఆస్కార్ కు పంపించాలని అనుకుంటునట్లుగా నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. ఈ మూవీలో రణ్ వీర్ సింగ్, అలియా ఓవర్ యాక్షన్‌ చేశారని, ఇలాంటి మూవీని ఆస్కార్ పంపిస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: “అసలైన కల్ట్ క్లాసిక్ సినిమా అంటే ఇదే..!” అంటూ… రవికృష్ణ “7/G బృందావన్ కాలనీ” రీ-రిలీజ్‌పై 15 మీమ్స్..!