ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన విలక్షణ నటనతో ఏ పాత్రలో అయిన అలవోకగా నటించగల అద్భుతమైన నటుడు. ఇటీవల కాలంలో ఆయన తాను నటించే సినిమాల కన్నా, ఇతర విషయాలపై కామెంట్స్ చేయడం ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.

Video Advertisement

మనసులోని మాటలను చాలా ధైర్యంగా చెప్పే నటుడు ప్రకాశ్ రాజ్. తాజాగా మరోసారి న్యూస్ లో నిలిచారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ కారణంగా ప్రకాశ్ రాజ్ పై ట్విట్టర్లో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆయన చేసిన ట్వీట్ ఏమిటో? ఇప్పుడు చూద్దాం..
ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడి పై అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. మరికొన్ని గంటల్లో  విక్రమ్ ల్యాండర్ చంద్రుడు దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టనుంది. చంద్రయాన్-3 సక్సెస్ అయితే తొలిసారి దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన దేశంగా చరిత్ర సృష్టించనుంది. ఆగస్ట్ 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం పై  అడుగుపెడుతుందని ఇస్రో వెల్లడించింది. రష్యా ప్రయోగించిన లూనా-25 విఫలం అవడంతో అన్ని దేశాల దృష్టి ప్రస్తుతం చంద్రయాన్-3 పైనే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా చంద్రయాన్-3 గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈక్రమంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విటర్ లో ఒక ఫొటోను షేర్ చేస్తూ, కామెంట్స్ చేశారు. ఆయన షేర్ చేసిన ఫొటోలో ఒక వ్యక్తి లుంగీ ధరించి, టీ పోస్తున్నట్లు ఉంది. అది కూడా కార్టూన్ లా ఉంది. ఇక ఈ ట్వీట్ కు ‘బ్రేకింగ్ న్యూస్.. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి నుండి పంపించిన తొలి చిత్రం’ అని ప్రకాశ్ రాజ్ రాసుకొచ్చారు. చంద్రయాన్-3 పై ప్రకాశ్ రాజ్ పెట్టిన పోస్టు వ్యంగ్యంగా ఉండటంతో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రయాన్-3 ఇండియాకి గర్వకారణం. కానీ, ప్రకాశ్ రాజ్ గుడ్డి ద్వేషంతో శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. మరొకరు చంద్రయాన్ 3ని ఇస్రో ప్రయోగించిందని, బీజేపీది కాదని కామెంట్ చేశారు. ప్రకాశ్ రాజ్ ట్వీట్‌ పై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Also Read: “అందుకే ఆంటీ అన్నది..!” అంటూ… “అనసూయ” పోస్ట్ పై శ్రీ రెడ్డి కామెంట్స్..! ఏం అన్నారంటే..?